Layoffs: దిగ్గజ ఐటీ సంస్థలు లే ఆఫ్ లు ప్రకటిస్తున్నాయి. ఆమెరికా నుంచి భారత్ దాకా ఉద్యోగాలు ఊడి పోతున్నాయి. 2008_09 కి మించి మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఎప్పటికి ముగుస్తుందో తెలియదు. అయితే టెక్ లే ఆఫ్ లు చూసి భయపడాల్సిన పనిలేదని, ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకునే వారికి భవిష్యత్తుపై భరోసా ఎప్పుడూ ఉంటుందని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంత మంచి హోదాలో ఉన్నా… కృత్రిమ మేధ, ఆగ్ మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాల్టీ వంటి వాటిపై దృష్టి పెట్టి వాటిల్లో నైపుణ్యాలు సాధించిన వారిదే భవిష్యత్తు అని వారు స్పష్టం చేస్తున్నారు..అలాగే… కరోనా అనంతర పరిస్థితిలో నేపథ్యంలో అధికంగా నియమించుకున్న వారిని ఆమెజాన్ వంటి సంస్థలు ఇప్పుడు తొలగిస్తున్నాయని వారు గుర్తు చేస్తున్నారు.. ఉదాహరణకు 2019 నాటికి అమెజాన్ ఉద్యోగుల సంఖ్య ప్యాంటు 7.18 లక్షలు. 2021 చివరికి ఆ సంఖ్య 16 లక్షలకు చేరింది.. ఇప్పుడు మళ్లీ ఆ సంస్థ తన ఉద్యోగులను తగ్గిస్తోంది. ఇక కొన్ని కంపెనీలు అమెరికా, యూరప్ దేశాల్లో తమ సిబ్బందిని తగ్గించుకుని ఇండియా వంటి దేశాల నుంచి రిమోట్ గా పని చేసే వారిని నియమించుకునే ప్రణాళికల్లో ఉన్నాయి.. కాబట్టి మన టెకీ లకు మంచే జరుగుతుందని ఐటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక విదేశీయులతో పోలిస్తే మన వాళ్లకు కంపెనీలు ఇచ్చే వేతనాలు తక్కువ. అంతేకాదు భారతీయులకు ప్రతిభ కూడా ఎక్కువ.. కాబట్టి కంపెనీలు విదేశీ సిబ్బందిని తొలగించి, కీలక ప్రాజెక్టుల్లో మన వారిని నియమించే అవకాశాలను పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఇక ఏడాది మొదటి 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు రోజుకు సగటున 16 వందల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. అవి బయటకు చెబుతున్న కారణమేంటంటే… వారిలో సరైన నైపుణ్యాలు లేవని… పైగా కంపెనీలు ఆర్థికమాంద్యం నేపథ్యంలో పెద్దపెద్ద ప్రాజెక్టులు లేక ఆర్థికంగా కష్టాలు పడుతున్నాయి.. అమెరికా లాంటి ఫెడరల్ బ్యాంకులు వడ్డీరేట్లను భారీగా పెంచాయి.. దీంతో కంపెనీలకు నగదు లభ్యత ఆశించినంత స్థాయిలో ఉండటం లేదు.. ఇది భవిష్యత్తు ప్రణాళికలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
మెరుగుపరుచుకోవాలి
కంప్యూటర్ యుగం ప్రారంభమైన తర్వాత సి ప్లస్ కు డిమాండ్ భారీగా ఉండేది. తర్వాత జావా, ఒరాకిల్ తెరపైకి వచ్చాయి. 2007 తర్వాత స్మార్ట్ ఫోన్లు రావడంతో సమాచార విప్లవం మరింత ఉధృతమైంది..యాప్ లు కూడా రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి ఒక్కసారి గా మారిపోయింది.. ఇదే సమయంలో కొత్త కొత్త సాంకేతికలు పుట్టుకొచ్చాయి. అందులో ముఖ్యమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇది ఇప్పుడు అన్ని రంగాలను శాసిస్తోంది.

దీనివల్ల ఉద్యోగాలకు కూడా కోతపడుతున్నది. అయితే లే ఆఫ్ నేపథ్యంలో ఐటీ కంపెనీలో అందరూ ఉద్యోగులను బయటికి పంపడం లేదు. తమ అవసరాలకు అనుగుణంగా ఉన్న వారిని మాత్రం ఉంచుకుంటున్నాయి.. వారికి వేతనాలు కూడా పెంచుతున్నాయి.. కారణాలు ఎలా ఉన్నప్పటికీ నైపుణ్యం పెంచుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్న అవసరాన్ని ఐటి ఉద్యోగులు గుర్తు ఎరగాలి.. లేకుంటే పింక్ స్లిప్ అందుకోవడం ఖాయం.