Fear About Romance: ఆలుమగల మధ్య శృంగారమే అసలు వ్యవహారం. అది లేకుంటే సృష్టి కార్యమే ఉండదు. అందుకే శృంగారానికి అంతటి ప్రాధాన్యం ఇస్తుంటారు. మన దినచర్యల్లో భాగంగా శృంగారం కూడా ఒక కార్యంగానే భావించాలి. లేదంటే దంపతుల మధ్య ప్రేమ చిగురించడానికి దారులు ఉండవు. ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం కలగాలంటే రోజు శృంగారం ఉండాల్సిందే. దీంతో వారి మధ్య అనురాగం, ఆప్యాయతలు పెరుగుతాయి. పరస్పరం మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

శృంగారం బంగారం కంటే విలువైనదని ఏనాడో మన పెద్దలు చెప్పారు. దాన్ని మనం పాటించాలి. జీవిత భాగస్వామిని దగ్గరకు చేసుకునే క్రమంలో శృంగారమే ప్రధానమైనదని గుర్తించాలి.
Also Read: YSRCP Plenary 2022: ప్రజలకు అన్నీ చేశాను.. ఒక మీరే తేల్చుకోండి అంటున్న ఏపీ సీఎం జగన్
శృంగారం విషయంలో కొందరికి కొన్ని అపోహలు, అనుమానాలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవాలి. లేదంటే అవి మీ సంసారానికి ప్రతిబంధకాలుగా నిలుస్తాయి. ఫలితంగా మీ సంసారం కకావికలం అవుతుంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది.
అప్పుడు మీరు ఒంటరిగా నిలవాల్సి వస్తుంది. అందుకే శృంగారం విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించాలి. కుదరని పక్షంలో వైద్యులను సంప్రదించి వారి అనుమానాలు పటాపంచలు చేసుకుంటే భవిష్యత్ బంగారంగానే ఉంటుంది.
పెళ్లయిన వెంటనే శృంగారంలో పాల్గొంటే గర్భవతిని అవుతానేమో అనే అనుమానాలు అందరిలో కలగడం మామూలే. ఎందుకంటే సెక్స్ చేస్తే గర్భం రావడం సాధారణమే. కానీ గర్భం రాకుండా ఉండటానికి కూడా ఇప్పుడు అనేక మార్గాలు ఉన్నాయి. నిరోధ్, పిల్లోస్ వాడకం వంటివి చేపడితే గర్భం రాదు. కానీ సృష్టి కార్యం జరగడానికి అడ్డంకులు సృష్టించొద్దు.
ఒకవేళ మనం ఇప్పుడు వద్దనుకుంటే తరువాత కావాలనుకున్నా పిల్లలు కలగరనే వాదన కూడా ఉంది. అందుకే సహజమైన రతినే కొనసాగించి పిల్లలు పుట్టినా అడ్డు చెప్పకపోవడమే మంచిదనే అభిప్రాయాలు ఉన్నాయి.

కొంతమందికి అందం మీద నమ్మకం ఉంటుంది. తాను అందంగా లేనేమో తన జీవిత భాగస్వామికి నచ్చుతానో లేదో అనే సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇందులో ఏ మాత్రం భయపడకుండా మీ జీవితభాగస్వామి ఇష్టాయిష్టాలు తెలుసుకుని అందుకనుగుణంగా మసలుకుంటే సరిపోతుంది. మీరే మీ భాగస్వామికి అందంగా కనిపిస్తారు. ఇది ఆడ, మగ వారికైనా ఒకటే.
అందుకే జీవిత భాగస్వామిని తృప్తి పరచేందుకు మీ వంతు సహకారం అందించండి అంతేకానీ అనవసర భయాలు పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
పెళ్లయిన కొత్తలో శృంగారంలో కలయిక వల్ల కొందరికి కడుపు నొప్పి వస్తుంటుంది. దీనికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. బెల్స్, లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు వంటివి వాడి నొప్పి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అంతేకాని అపోహలతో సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దు. తగిన వైద్యుల సలహాలు పాటించి నొప్పి నివారణ మందులు వాడితే చాలు. కానీ ఏవేవో అనుమానాలు పెట్టుకుని పచ్చని సంసారాన్ని ముక్కలు చేసుకోవద్దు. సందేహాలు ఉంటే తీర్చుకోవాలి. అనుమానాలుంటే నివృత్తి చేసుకోవాలి.
శృంగారంలో ప్రధాన భూమిక పోషించేది వ్యక్తిగత పరిశుభ్రతే. కొంతమంది పరిశుభ్రతకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. ఫలితంగా జీవిత భాగస్వామి ఇబ్బందికి గురవుతుంటారు. పరిశుభ్రతకు పెద్దపీట వేయాల్సిందే. స్నానం చేయడం, సెంట్లు చల్లుకోవడం, పౌడర్ రాసుకోవడం, పూలు పెట్టుకోవడం వంటివి మత్తులోకి దించుతాయి. దీంతో జీవిత భాగస్వామి పిచ్చెక్కిపోయి రతిలో మన్మథుడిలా రెచ్చిపోతాడు. అందుకే వ్యక్తిగత పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చుకుంటే మంచిది.

ఇన్ఫెక్షన్ల భయం కూడా ఉంటుంది. ముఖ్యమంగా సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధుల్లో హెచ్ఐవీ ప్రధానమైనది.
దీంతో కొందరిలో ఏవో భయాలు ఉండటం సహజమే. కానీ కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా ఇన్ఫెక్షన్ల భయం కూడా తొలగించుకోవచ్చు. అంతేకాని వాటిని తలుచుకుని రతిలో పాల్గొనడం మానుకుని భయపడవద్దు. వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి జీవితాన్ని నందనవనం చేసుకునే శృంగారం మానుకోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇటీవల జరిపిన ఓ సర్వేలో దంపతులు శృంగారంలో పాల్గొంటే ఎలాంటి వ్యాధులు కూడా దరిచేరవనే విషయం తెలిసింది. దీంతో ఆలుమగలు అనవసర భయాలు పెట్టుకోకుండా రతిని ఎంజాయ్ చేస్తూ శృంగార జీవితాన్ని కూడా రసమయం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి అనుమానాలు లేకుండా ఇద్దరి మధ్య సమన్వయం ఉంటే ఎంతటి సమస్య అయినా ఇట్టే జయించవచ్చు. అందుకే మీరు కూడా మీ జీవితాన్ని సుందరమయం చేసుకోవాలంటే శృంగారమే ఓ మందుగా భావించాలని చెబుతున్నారు.
Also Read:Conocarpus Plant: సండే స్పెషల్: భారత్-పాకిస్తాన్ లను భయపెడుతున్న ఆ మొక్క కథేంటి?




