Extramarital Relationship: నేటి కాలంలో భర్తలకు విలువ లేకుండా పోయింది. కొంతమంది భార్యలు చేస్తున్న నిర్వాకం వల్ల భర్తలకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. ఇటీవల కాలంలో భార్యల చేతిలో భర్తలు హతమయ్యారు.. వివాహేతర సంబంధాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఏదో ఒక తీరుగా భర్తలు భార్యల చేతిలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ.. కోర్టులు శిక్షలు విధిస్తున్నప్పటికీ.. కొందరి భార్యల ప్రవర్తన తీరులో ఎటువంటి మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కేరి జిల్లా పర్సా ముర్తా గ్రామంలో జరిగిన ఓ సంఘటన సభ్య సమాజంలో చోటుచేసుకుంటున్న దారుణాలకు అద్దం పట్టింది.
Also Read: ఈ యాప్ తో వద్దన్నా వ్యాయామం చేస్తారు.. ఎలాగో తెలుసుకోండి..
పర్సా ముర్తా గ్రామానికి చెందిన రామ్ చరణ్ తన భార్య జానకి దేవితో ఉంటున్నాడు. వీరికి 20 సంవత్సరాల క్రితమే పెళ్లయింది. రామ్ చరణ్ ముంబైలో టైల్స్ వేస్తూ జీవన సాగిస్తున్నాడు. రామ్ చరణ్, జానకి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. జానకి గృహిణిగా ఉండేది. సరిగ నాలుగు సంవత్సరాల క్రితం జానకికి 24 సంవత్సరాల వయసున్న సోను ప్రజాపతి అనే దినసరి కూలితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అతనితో ఉండడం మొదలుపెట్టింది. 7 నెలల పాటు వారిద్దరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న రాంచరణ్ పెద్దమనుషులను తీసుకెళ్లి ఆమె ఉండే చోటికి వెళ్ళాడు.. ఇదేం పద్ధతని నిలదీశాడు. దీంతో ఆమె నన్ను క్షమించమని కోరింది. తర్వాత రామ్ చరణ్ వద్దకు వచ్చింది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత తన ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయింది.
Also Read: మీ రీల్స్ పిచ్చి పాడుగానూ.. బంగారం లాంటి బెంజ్ కారును ఇలా చేశారు ఏంట్రా
జానకి కనిపించకపోవడంతో రామ్ చరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఆమె గురించి వెతికే ప్రయత్నం చేస్తుండగా.. ఊహించని విధంగా రామ్ చరణ్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు..” ఆమె కోసం వెతకడం అనవసరం. ఆమె నా జీవితంలో ఉండడం కూడా అనవసరమే. ఆమె తన ప్రియుడుతో ఉండడం నాకు ఇష్టమే. ఇకపై ఆమెతో ఎటువంటి సంబంధాలు నాకు ఉండదు. ఆమె జీవితాన్ని ఆమెకు నచ్చినట్టుగా గడపడం నాకు ఇష్టమే. గతంలో కూడా ఆమె ఇలాగే వెళ్ళిపోయింది. ఏడు నెలల తర్వాత వచ్చింది. ఇద్దరు పిల్లలు ఉన్నారని.. సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇష్టం లేక ఆమెను క్షమించాను. ఇప్పుడు ఆమె మళ్ళీ వెళ్ళిపోయింది. నన్ను ఏదైనా చేస్తుందనే భయం వేధిస్తోంది. ఆమెతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు. నాకు ప్రాణభయం ఉంది. అందువల్లే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని” రామ్ చరణ్ స్పష్టం చేశాడు. అంతేకాదు పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఒక ఒప్పంద పత్రాన్ని రాసి.. పోలీసులకు సమర్పించి వచ్చాడు. ఇటీవల కాలంలో భార్యల చేతిలో భర్తలు హతమవుతున్న నేపథ్యంలో.. రామ్ చరణ్ తన భవిష్యత్తుకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకున్నాడని స్థానికులు అంటున్నారు. జానకి దేవి చేసిన పనిని తప్పుపడుతున్నారు. ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ ఇలాంటి పని చేయడానికి వారు దుయ్యబడుతున్నారు.