90s Childhood Memories: జీవితం అనేది తాత్కాలికం. ఆ తాత్కాలికమైన జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి. గొప్పగా చెప్పుకునే అనుభూతులు ఉండాలి. అలా ఉంటేనే జీవితం సార్ధకమైనట్టు. నేటి కాలంలో పిల్లలకు ఇలాంటివి ఏవీ ఉండడం లేదు. టెక్నాలజీ సృష్టించిన మాయాజాలం వల్ల ప్రతిదీ కాళ్ల ముందుకు.. కళ్ళ ముందుకు వస్తోంది. కష్టపడాల్సిన అవసరం లేకుండా.. చెమట చిందించాల్సిన అగత్యం లేకుండా జరిగిపోతోంది. అందువల్ల పిల్లలకు సొంత జ్ఞాపకం అనేది లేకుండా పోతుంది. కానీ 90 ల కాలంలో పుట్టిన పిల్లలకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అంతకుమించి అనుభూతులు ఉన్నాయి.. దానికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో కనిపిస్తోంది.
Also Read: మీరు జీవితంలో ఎదగాలంటే ఈ ఒక్కటి పక్కకు పెట్టండి..
నాటి రోజుల్లో రీల్ టేప్ రికార్డర్ లు ఉండేవి. వాటిల్లో రీల్ క్యాసెట్లు వేసి పాటలు వినేవారు. ఒక్కోసారి స్ట్రక్ అయితే చేతి వేలుతో రీల్ క్యాసెట్ ను సరి చేసేవారు.. కొంతకాలానికి వాక్మెన్ అందుబాటులోకి వచ్చింది. వాక్ మెన్ లో పాటలు వినడం అప్పట్లో ఓ లగ్జరీగా ఉండేది. అందులో ఉన్న బ్యాటరీలను తొలగించి చార్జ్ చేసి మళ్లీ వాడేవారు.. తమ్స్ అప్ క్యాప్ ను ఉపయోగించి చేతిలో బొంగరాన్ని ఆడించేవారు. రబ్బర్లతో ఆటలు ఆడేవారు.. సైకిల్ను సరికొత్తగా ముస్తాబు చేసేవారు. వేసవికాలంలో ఈతలు కొట్టడం.. ఈత పళ్ళు తినడం.. తాటి ముంజలను ఆస్వాదించడం.. తునికి పండ్లను తినడం.. సీమ చింతకాయలను సేకరించడం.. తోటలకు వెళ్లి దొంగతనంగా మామిడికాయలను తెంపుకు రావడం.. వంటివి 90 ల కాలంలో పుట్టిన పిల్లలకు మధురమైన అనుభూతులు. ఇసుకలో గుజ్జనగూళ్లు ఆడుకోవడం.. కోతికొమ్మచ్చి ఆడటం.. ఇటువంటివి వారికి గొప్ప అనుభూతులు. నాటి రోజుల్లో పిల్లలకు ఆటవిడుపు అధికంగా ఉండేది కాబట్టి శారీరకంగా బలంగా ఉండేవారు. సహజసిద్ధంగా ఉండే పండ్లను తినేవారు. ఫలితంగా వారికి పెద్దగా అనారోగ్యాలు సోకేవి కాదు. పాఠశాలల్లో కూడా ఆడుకోవడానికి ఆటస్థలాలు ఉండేవి. ఇప్పటి మాదిరిగా ఒత్తిడితో కూడిన చదువులు ఉందేవి కాదు. ర్యాంకులు, మార్కులు అంటూ ఇబ్బంది ఉండేది కాదు. అందువల్లేవారు మానసికంగా కూడా ధైర్యంగా ఉండేవారు.
Also Read: ఈ యాప్ తో వద్దన్నా వ్యాయామం చేస్తారు.. ఎలాగో తెలుసుకోండి..
నాటి రోజులకు సంబంధించిన దృశ్యాలతో రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నది. 90 ల కాలం నాటి పిల్లలు అనుభవించిన సౌకర్యాలు.. మదిలో నిక్షిప్తం చేసుకున్న జ్ఞాపకాలు అన్ని ఒకదాని వెంట ఒకటి వస్తుంటే నోస్టాల్జియా లాగా కనిపిస్తోంది. నేటి జనరేషన్ జెడ్ తరం వీటన్నింటికీ దూరంగా ఉంటున్నారు. ర్యాంకులు, మార్కులు, స్మార్ట్ ఫోన్ల చుట్టూ వారి బాల్యం తిరుగుతోంది. తద్వారా ఎటువంటి జ్ఞాపకం అనేది లేకుండా.. ఎటువంటి అనుభూతి పొందకుండా వారి జీవితం నడుస్తోంది. అందువల్లే ఈ తరం పిల్లలు ఎటువంటి భావోద్వేగాలు లేకుండా బతుకుతున్నారు. రోబోలను తలపిస్తున్నారు.