Social Media Obsession:సోషల్ మీడియాలో స్టార్ అయిపోవాలని అందరికీ ఉంటుంది. కానీ అందరూ స్టార్ కాలేరు. కొందరికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. వారు ఏం చేసినా జనాలకు నచ్చుతుంది కాబట్టి వారికి ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది.. వారిలాగే మనమూ కావాలి అంటే కష్టపడాలి. వినూత్నంగా ఆలోచించాలి. అవసరమైతే మెదడును మధనం చేయాలి. అప్పుడే సోషల్ మీడియాలో ప్రాచుర్యం సంపాదించుకోవచ్చు. స్టార్ లాగా ఎదగొచ్చు. అంతే తప్ప పిచ్చి పిచ్చి పనులు చేసి సోషల్ మీడియాలో స్టార్ అవుదాం అనుకుంటే కుదరదు.
Also Read: వైసీపీ నేత రోజా షోలో ‘హరి హర వీరమల్లు’ ప్రొమోషన్స్.. వైరల్ అవుతున్న వీడియో!
సోషల్ మీడియా పిచ్చి వల్ల.. రీల్స్ పైత్యం వల్ల చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో రీల్స్ పిచ్చితో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో యువకులు, యువతులు ఉన్నారు. కొంతమంది యువకులైతే కొండల మీదకి ఎక్కి రీల్స్ చేయబోయి అందులో పడి చనిపోయారు. ఇక యువతులయితే లోయల వద్దకు వెళ్లి రీల్స్ చేస్తూ అందులో పడి కన్నుమూశారు. వాస్తవానికి నూతనత్వం అందించడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉండగా.. అలాకాకుండా అడ్డగోలుగా పనులు చేసి దానినే నూతనత్వం అని చెబుతూ కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారికి ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఉపయోగము ఉండడం లేదు. ఎన్ని ఉదాహరణలు చూపించినప్పటికీ ప్రయోజనం కలగడం లేదు. పైగా వారి పిచ్చితో ఇతరులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవ తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాలో స్టార్ కావాలని ఓ యువకుడు రైలు పట్టాల పై పడుకున్నాడు రైలు వెళుతున్నంత సేపు అతడు అలానే ఉన్నాడు. రైల్వే వెళ్లిపోయిన తర్వాత లేచి తనేదో ప్రపంచాన్ని జయించినంత బిల్డ్ అప్ ఇచ్చాడు.
Also Read: ఈ మూడు విషయాలకు దూరంగా ఉంటే మిమ్మల్ని ఆపేవారు ఉండరు..
తాజాగా సూరత్ లో కూడా ఓ ఘటన జరిగింది. కొంతమంది యువకులు రిలీస్ చేద్దామని పిచ్చి ప్రయత్నం చేశారు. చివరికి ఇరుక్కుపోయారు. సూరత్ లోని డుమాస్ బీచ్ లో కొంతమంది యువకులు వీకెండ్ కావడంతో తమ బెంజ్ కారు తో రీల్స్ చేయడానికి ప్రయత్నించారు. ఈ బీచ్ కు శని ఆదివారాలు విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. అయితే ఈ బీచ్ పరిరక్షణ, సముద్ర జంతువుల రక్షణ నిమిత్తం ఇక్కడి అధికారులు సముద్ర ఒడ్డు వద్దకు ఎటువంటి వాహనాలను అనుమతించరు.. సందర్శకులనూ దూరం పెడతారు. అయితే ఆ యువకులు తమ బెంజ్ కారుతో పోలీసుల కళ్ళు కప్పి వచ్చారు. ఎక్కడైతే నిషేధిత ప్రాంతం ఉందో.. అక్కడికి వెళ్లారు. అక్కడ తమ బెంజ్ కారుతో డ్రైవ్ చేస్తూ.. ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేశారు. వాటిని రీల్స్ గా రూపొందించాలనేది వారి ప్రయత్నం. అయితే ఆ కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత బురద మట్టిలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ అందులో నుంచి బయటికి రావడం లేదు.
ఆ యువకులు తీవ్రంగా కష్టపడ్డారు. తమ శక్తిని మొత్తం ప్రయోగించారు. తమ యుక్తిని మొత్తం ఉపయోగించారు. ఆయనప్పటికీ ఆ కారు అందులోంచి బయటికి రాలేదు. ఆ ప్రాంతానికి కొంత దూరంలో ఉన్న సందర్శకులు అక్కడి దృశ్యాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ యువకుల వ్యవహారం బయటపడింది. ఇది కాస్త పోలీసులు దాకా చేరింది. దీంతో వారు సంఘటన స్థలానికి వచ్చి ప్రత్యేకమైన యంత్రం సహాయంతో కారును బయటికి తీసుకొచ్చినట్టు సమాచారం. అంతేకాదు సున్నితమైన ప్రాంతంలో కారు డ్రైవింగ్ చేసినందుకు వారిపై కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది.