Janasena MLAs & MLCs Support HHVM : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు( Harihara Veera Mallu ) చిత్రం రేపు విడుదల కానుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. చారిత్రాత్మక కథాంశం ఆధారంగా ఈ చిత్ర నిర్మాణం జరిగింది. దీంతో భారీ అంచనాలు పెంచేసింది. దీంతో జనసైనికులతో పాటు మెగా అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో వారిలో ఒక రకమైన భయం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థి సోషల్ మీడియా కాచుకొని కూర్చుంది. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో ఎదురైన పరిణామాలను.. ఇప్పుడు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భయం వెంటాడుతోంది. తద్వారా అల్లు అర్జున్ అభిమానులు సైతం ట్రోలింగ్ చేస్తారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమాను తమ భుజస్కందాలపై వేసుకున్నారు జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
Also Read: ఇద్దరు దర్శకులు కలిసి చేసిన హరిహర వీరమల్లు మూవీ పరిస్థితి ఏంటి..?
రాష్ట్ర వ్యాప్తంగా పూజలు, ప్రదర్శనలు..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ప్రత్యేక పూజలు, ప్రదర్శనలు చేపడుతున్నారు. తిరుపతిలో( Tirupati) జనసేన శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా జన సైనికులు సంబరాలు చేస్తున్నారు. ప్రత్యేక మీడియా సమావేశాలు సైతం నిర్వహించి.. హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. చివరకు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా రంగంలోకి దిగారు. జనసేనకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి.. చారిత్రాత్మక కథ అంశంగా నిర్మించిన హరిహర వీరమల్లు సినిమాను ప్రతి జనసైనికుడు చూడాలని పిలుపునిచ్చారు. చూడడమే కాకుండా టిక్కెట్లు దొరకని ప్రేక్షకులకు దొరికేలా ఏర్పాట్లు కూడా చేయాలని పిలుపునివ్వడం విశేషం.
సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తారని..
అయితే జన సైనికుల్లో ఒక రకమైన భయం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో( social media) నెగిటివ్ టాక్ తెచ్చి సినిమాను ప్లాఫ్ చేస్తారన్న అనుమానాలు ఉన్నాయి. అదే జరిగితే జనసేనకు రాజకీయంగా కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అందుకే జన సైనికులు, చివరకు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు. అయితే ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి ఈరోజు ఈ ప్రమోషన్స్ అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ విషయంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అతి చేస్తున్నారన్న విమర్శ ఉంది.
Also Read: ఆడవాళ్లకు నెలకు రూ.1500 ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలట?
ఆ భయంతోనే..
పొరపాటున ఈ చిత్రం ప్లాప్ అయితే జనసేనకు డ్యామేజ్ తప్పదు. ఈ భయంతోనే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు. అయితే పరోక్ష సంకేతాలు ఇవ్వాలే కానీ.. ఇలా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పిలుపులు ఇవ్వడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో జరిగే ప్రచారం గురించి జన సైనికులకు తెలియంది కాదు. గతంలో చాలా సినిమాలు ఇలానే బాధిత వర్గాలుగా మారాయి. పుష్ప 2 సినిమా విషయంలో కూడా ఇలాంటి నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ నెగిటివ్ టాక్ అధిగమించి విజయాన్ని అందుకుంది ఆ చిత్రం. అయితే అటువంటి అనుమానాలు, భయంతోనే జనసేన ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిన తరువాత తొలిసారిగా వస్తున్న చిత్రం కావడం.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రమోషన్ చేయడం కనిపిస్తోంది. అయితే ఇది లాభం కంటే నష్టం చేకూర్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.