Expensive cocktail: దేశంలో ఎన్నో ఖరీదైన వస్తువులు ఉన్నాయి. మనుషులు వాడే వస్తువుల నుంచి జంతువుల రక్తం ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే మనుషులు సేవించే మద్యంలో కూడా ఖరీదైనవి చాలానే ఉన్నాయి. కొందర బయటకు వెళ్తే ఎక్కువగా పానీయాలు సేవిస్తుంటారు. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ పానీయాలు సేవించాలని భావిస్తారు. ముఖ్యంగా కాక్‌టైల్స్ ఎక్కువగా తాగుతుంటారు. సాధారణంగా కాక్‌టైల్ ఒక వెయ్యి లోపల ఉంటాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన కాక్‌టైల్ ఒకటి ఉంది. ఈ కాక్‌టైల్ ధర రూ. 10,000 ఉంటుంది. బంగారు రుచితో ఈ కాక్‌టైల్‌ను తయారు చేశారు. ఈ కాక్‌టైల్‌ను జ్యువెల్ ఆఫ్ తాన్సెన్ తయారు చేసింది. ఈ కాక్‌టైల్ దేశంలోనే అత్యంత ఖరీదైనది. దీన్ని హైదరాబాద్‌లోని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అయిన తాన్‌సెన్ తయారు చేశారు. ఒక గ్లాస్ కాక్‌టైల్‌లో సౌదీ అరేబియా నుంచి తీసుకొచ్చిన అజ్వా ఖర్జూరం, ఇటాలియన్ పైన్ నట్స్, ట్రఫుల్-ఇన్ఫ్యూజ్డ్ వెర్మౌత్, రాయల్ సెల్యూట్ 21-ఇయర్ విస్కీ, బంగారు ఆకులతో ఉన్న ఐస్ క్యూబ్ వేస్తారు. ఇలా తయారు చేసిన ఒక గ్లాసు కాక్‌టైల్ విలువ రూ. 10000. అయితే ఈ కాక్‌టైల్‌ను తాగాలంటే కూడా ఇస్తారు. ఏదో అందరూ చూడటానికి మాత్రమే కాకుండా మీరు టేస్ట్ చేయాలనుకున్నా కూడా చేయవచ్చు.
ఈ ఖరీదైన కాక్‌టైల్ తయారు చేసినందుకు ఆసియాలోని 50 బెస్ట్ బార్‌లచే రోకూ ఇండస్ట్రీ ఐకాన్ అవార్డు 2024ను కూడా ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అయితన తాన్‌సెన్ అందుకున్నారు. ఈ కాక్‌టైల్ తాగడానికి చాలా టేస్టీగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. దీన్ని టేస్ట్ చేయడం గొప్ప అనుభూతి అని అంటున్నారు అయితే ఇలాంటి ఇంకా ఎన్నో ప్రత్యేకమైన డ్రింక్‌లను తయారు చేయాలని తాన్‌సన్ భావిస్తున్నాడు. అయితే కేవలం ఈ కాక్‌టైల్ మాత్రమే కాకుండా దక్షిణ భారతీయ మసాలా దినుసులను సమకాలీన వస్తువులతో కలిపారు. పామ్ లిక్కర్, బెల్లం సిరప్‌తో కలిపి కూడా కొన్ని డ్రింక్‌లను తయారు చేశారు. అలాగే బెటిల్ బ్లేజ్ రెడ్ వైన్, బోర్బన్ విస్కీలతో కొన్ని ప్రత్యేకమైన వాటిని తయారు చేశారు. సౌస్ వైడ్ కషాయాలు, చేతితో రూపొందించిన సిరప్‌లు ఇలా ఒకటేంటి ఎన్నో రకాల డ్రింక్‌లను ఇప్పటి వరకు తయారు చేశారు. అయితే ఇలా ఖరీదైన వస్తువులు మన ఇండియాలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మద్యపానంలో కూడా ఖరీదైనవి చాలానే ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పురాతన కాలం నుంచి ఉన్న వీటిని తాగితే టేస్టీ కూడా వేరేగా ఉంటాయి. అయితే ఈ పురాతన కాలం నుంచి ఉన్న వాటిలో కొన్నింటిని మాత్రమే విక్రయిస్తారు. మరికొన్నింటిని అలాగే ప్రదర్శన కోసం ఉంచుతారు. ఈ కాక్‌టైల్‌ను కేవలం ప్రదర్శన కోసం మాత్రమే ఉంచకుండా.. తాగడానికి కూడా ఉపయోగిస్తారు. మరి ఇంత ఖరీదైన కాక్‌టైల్‌ను మీరు ఎప్పుడైనా తాగారా? తాగితే కామెంట్ చేయండి.