https://oktelugu.com/

Chanakyaniti: ఈ స్వభావం ఉన్నవారికి సాయం చేస్తే.. పులికి మేత వేసినట్లే!

కొన్ని స్వభావాలు ఉన్న మనుషులకు అసలు సాయం చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. వీరికి సాయం చేయడం వల్ల వారు మాత్రం మనకి మంచి జరగకూడదనే కోరుకుంటారు. మరి ఏయే స్వభావం ఉన్న వారికి అసలు సాయం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 23, 2024 12:34 pm
    chanakya-niti

    chanakya-niti

    Follow us on

    Chanakyaniti: సాయం చేసే గుణం ప్రతీ ఒక్కరిలో ఉండాలి. ఆపదలో ఉన్నా అని చేయి చాచిన వాళ్లనే కాకుండా అందరిని కూడా సాయం చేసే గుణం ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. ఒకరికి సాయం చేస్తే తప్పకుండా ఆ ప్రతిఫలం వస్తుంది. గతంలో మనం చేసే మంచి పనులే భవిష్యత్తులో మనకి సాయం చేస్తాయి. అయితే కొందరికి ఎంత సాయం చేసిన కూడా కొంచెం కూడా కృతజ్ఞత భావం కూడా ఉండదు. వారికి సాయం చేస్తే పులికి మేత వేసినట్లే. కష్ట సమయంలో మనం సాయం చేసిన కూడా వాటిని గుర్తుపెట్టుకోకుండా మన నాశనాన్నే కోరుకుంటారు. ఆకలి వేస్తుందని అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవాడికి చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని కూడా మన పెద్దలు అంటుంటారు. దీన్ని కొందరు పవిత్రంగా భావిస్తారు. అయితే కొన్ని స్వభావాలు ఉన్న మనుషులకు అసలు సాయం చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. వీరికి సాయం చేయడం వల్ల వారు మాత్రం మనకి మంచి జరగకూడదనే కోరుకుంటారు. మరి ఏయే స్వభావం ఉన్న వారికి అసలు సాయం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఇతరులను ఎప్పుడూ బాధపెట్టేవారికి..
    కొందరు ఇతరులు సంతోషం కంటే బాధనే చూడాలని కోరుకుంటారు. ఇతరులను చీప్‌గా చూడటం, వారి క్యారెక్టర్‌ను తక్కువ చేసి చూడటం, కనీసం గౌరవించకపోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వారికి అసలు సాయం చేయకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఇలాంటి వ్యక్తులతో అసలు స్నేహం కూడా చేయకూడదని చెబుతున్నాడు. ఎందుకంటే ఇలా పక్క వారి బాధను కోరుకునే వారితో స్నేహం చేస్తే అవే ఆలోచనలు మనకి కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటి స్వభావం ఉన్నవారితో ఎప్పుడూ కూడా స్నేహం చేయవద్దు. అలాగే సాయం కూడా చేయకూడదని చాణక్య నీతి చెబుతోంది.

    కనీసం సంస్కారం లేని స్త్రీలకు..
    కొంతమంది అమ్మాయిలకు అసలు సంస్కారం ఉండదు. పెద్దవాళ్లను, కుటుంబ సభ్యులను అసలు గౌరవించరు. ఎప్పుడు ఏదో విధంగా మాటలు అంటూనే ఉంటారు. ఇలాంటి వారిని అబ్బాయిలు అసలు వివాహం చేసుకోకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఇలాంటి అమ్మాయిలకి సాయం చేసిన లేకపోతే పెళ్లి చేసుకున్న జీవితాంతం కూడా నరకమే. భర్త, కుటుంబంతో సంతోషంగా ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలి. అంతే కానీ ప్రతీ విషయానికి గొడవలు పడుతూ.. ఉండే అమ్మాయిలు ఇళ్లు కూడా ఎప్పుడూ సరిగ్గా ఉండదు. వీరి వల్ల కుటుంబమే నాశనం అవుతుంది. ఇలాంటి అమ్మాయిలకు అబ్బాయిలు దూరంగా ఉండటమే మంచిదని చాణక్య నీతి చెబుతోంది.

    మూర్ఖులకు అసలు సాయం చేయకూడదు
    కొందరు అజ్ఞానంతో ఉంటారు. గురువు ఎంత చెప్పిన కూడా వినడు. ఇలాంటి వారికి ఎన్ని చెప్పిన కూడా వ్యర్థమే అని చాణక్య నీతి చెబుతోంది. తెలివి తక్కువ అయిన విద్యార్థి కోసం గురువు తన సమయాన్ని వృథా చేసుకోవడం వేస్ట్ అని చెబుతోంది. కొందరికి ఎంత మంచి చెప్పిన కూడా ఇతరుల చెప్పిన మాట వినకుండా నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని నమ్ముతుంటారు. అలాంటి వారికి చెప్పడం వృథా అని వీరికి దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. అయితే వీరే కాకుండా హానికరంగా ఉన్నవారు, అసూయ, కొందరు ద్వేషపూరితంగా ఉంటుంటారు. ఇలాంటి వారితో అసలు ఉండకూడదని చాణక్య నీతి చెబుతోంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.