https://oktelugu.com/

Kanuma Festival 2025 : కనుమ రోజు కాకి కూడా ఊరు దాటదు? మరి మీరు దాటుతున్నారా?

సంక్రాంతి వచ్చింది తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో, కోడి పందాలతో అంటూ ఓ పాట మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఎందుకు గుర్తు ఉండదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 15, 2025 / 08:26 AM IST

    Kanuma Festival 2025

    Follow us on

    Kanuma Festival 2025 : సంక్రాంతి వచ్చింది తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో, కోడి పందాలతో అంటూ ఓ పాట మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఎందుకు గుర్తు ఉండదు. ఇదేమైన పాత కాలమా? రీల్స్ కాలం, మర్చిపోతే ఆ రీల్స్ మమ్మల్ని మర్చిపోనిస్తాయా అని అంటున్నారు కదా. అయితే ఈ రోజుతో ఈ నాలుగు రోజుల పండగలో కాస్త మూడవ రోజు వచ్చింది. భోగి, సంక్రాంతి, కనుమ, కానుమ్ పొంగల్ అని నాలుగు రోజుల పండగ. అయితే ఈ పండగలో ప్రతి రోజుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో ఈ రోజు గురించి మనం తెలుసుకుందాం. అంటే కనుమ గురించి అండి. ఈ రోజు ఊరి పొలిమేర కూడా దాటదు అంటారు. ఊరి నుంచి ఎవరు కూడా వెళ్ళకూడదు. మరి ఇలా ఎందుకు అంటారో మీకు తెలుసా? అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

    సంక్రాంతి రోజు ప్రతి వాడు, ఊరు రంగుల మయం అవుతుంది. గాలిపటాలతో ఆకాశం నిండిపోతుంది. కొత్త అల్లుళ్లతో లోగిళ్లు అందంగా మారుతాయి. భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పండుగ దినాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇవి తెచ్చే ఆనందం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయినా ఈ పండుగను మెచ్చని వారు ఎవరు ఉంటారు చెప్పండి. అదంతా పక్కన పెడితే, చుట్టాలు ఇంటికి వస్తారు. కొత్త అల్లుళ్ళు ఇంటికి వెళ్తారు. ఇక ఉద్యోగ బాధ్యతలు అంటూ వెళ్లిన చాలా మంది పట్నం వదిలి ఊరి బాట పడతారు.

    ఎంత పండగ అంటే ఇష్టం అయినా ఎన్ని పిండి వంటలు తిన్నా సరే తిరిగి మళ్లీ ఉన్న గూటికి వెళ్లాల్సిందే. బతుకు దెరువు బాట పట్టాల్సిందే. అందుకే వచ్చిన వారు వెళ్లక తప్పదు. చాలా మందికి మూడు రోజులు సెలవులు ఉంటాయి. అందుకే భోగి, సంక్రాంతి ఎంజాయ్ చేసి కనుమ రోజు తిరుగు ప్రయాణం అవ్వాలి అనుకుంటారు. కానీ అలా వెళ్లడం నిషేధం అంటారు పెద్దలు. అవునండోయ్ ఓ నానుడి మీకు గుర్తుందా? కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికీ కదలవు అంటారు పెద్దలు. అంటే ఆ రోజు ఎక్కడికి వెళ్లకూడదు అని అర్థం.

    ఇక కనుమ రోజు పశువులను పూజిస్తారు తెలుగు ప్రజలు. పశువులను నదికి తీసుకొని వెళ్లి వాటికి మంచిగ స్నానం చేయించి, పసుపు కుంకుమలను వాటి కొమ్ములకు పెట్టి మెడలో గజ్జెలు కట్టి పూలు వేసి చివరికి హారతి ఇచ్చి పశువులను పూజిస్తారు. ఇలా పశువులను పూజించడం మనకు మాత్రమే సొంతం కావచ్చు. మరి కనుమ అంత గొప్పది కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఉంది లింక్ ఉంది. అయితే ఇప్పుడు అంటే ఇంటికి ఒక బైక్, కారు వంటివి వచ్చాయి. అవసరం అయితే బస్ లు, ఆటోలకు వెళ్తున్నారు. కానీ ఒకప్పుడు పొలంలో పని చేయాలన్నా, ఇంటి వారిని వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్లాలి అన్నా ఎద్దులే ముందు ఉండేవి. ఇక ఊరికి వచ్చిన వారు అప్పుడు ఎండ్ల బండి మీదనే వెళ్లేవారు. పాపం వాటికి విశ్రాంతి ఇవ్వాలి అని ఇలా కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారట.

    రైతులకు ఎంతో సహాయం చేసే పశువులకు ఒక్క రోజు అయినా విశ్రాంతి ఇవ్వాలని ఇలా చెబుతారు. మరి ఇదంతా చదివిన తర్వాత మీకు ఇంకో డౌట్ వస్తుంది. అయినా పశువుల కోసం కదా ఈ పండుగ. ఇప్పుడు ఎలాగూ బైకులు, బస్ లలోనే వెళ్తాం. పశువులను ఇబ్బంది పెట్టడం లేదు కదా అంటారా? అయినా సంవత్సరానికి ఒకసారి అదీ కూడా పండగ ఉంటే ఇంటికి వెళ్తారు. సరదాగా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో గడిపేయండి బ్రో. వచ్చాక మళ్లీ ఈ రోబో లైఫ్ తప్పదు కదా.