Homeఆంధ్రప్రదేశ్‌Kallakkadal: కడలికి కోపమొచ్చింది.. కేరళ, తమిళనాడుపై ప్రభావం.. కేంద్రం అలర్ట్‌!

Kallakkadal: కడలికి కోపమొచ్చింది.. కేరళ, తమిళనాడుపై ప్రభావం.. కేంద్రం అలర్ట్‌!

Kallakkadal: సముద్రానికి ఉన్నంత ఓపిక ఉండాలి అని పెద్దలు అంటుంటారు. ఎందుకంటే సముద్రానికి సాధారణంగా కోపం రాదు. తుఫాన్లు ఏర్పడినప్పుడు, అల్పపీడనాలు ఏర్పడినప్పుడు, భూకంపాలు సంభవించినప్పుడు మాత్రం సముద్రం అల్లకల్లోంగా మారుతుంది. ముందుకు రావడం, వెనక్కి వెళ్లడం వంటి పరిణామాలు జరుగుతాయి. మిగతా వేళళ్లో సముద్రం సాధారణ అలలు మినహా ఎలాంటి ప్రమాదం ఉండదు. అందుకే చాలా నగరాలు సముద్రం ఒడ్డునే వెలిశాయి. అయితే తాజాగా సముద్రుడికి కోపం వచ్చింది. కల్లక్కడల్‌ రూపంలో మన దేశంలోని రెండు రాష్ట్రాలపై తన ప్రతాపం చూపించబోతున్నాడు. వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్రం అలర్ట్‌ అయింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలను అల్ట్‌ చేసింది.

అకస్మాత్తుగా ఉప్పెన..
జనవరి 15న రాత్రి హిందూ మహా సముద్రంలో అకస్మాత్తుగా ఉప్పెన రానున్న కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓసియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ హెచ్చరించింది. జనవరి 15 అర్ధరాత్రి సుమారు 11:30 నుంచి 12 గంటల వరకు తీరం వెంట పలు ప్రాంతాల్లో ఒక మీటర్‌ మేర అలల తాకిడి ఉంటుందని అంచనా వేసింది. బుధవారం రాత్రి సముద్ర ఉప్పెన కల్లక్కడల్‌ ముప్పు పొంచి ఉందని కేంద్ర సంస్థ ఐఎన్‌సీవోఐఎస్‌ తమిళనాడు, కేరళ రాష్ట్రాలను హెచ్చరించింది. తీరప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కల్లక్కడల్‌ అంటే..
సాధారణంగా అల్పపీడనం, వాయుగుండం, తుపాను వంటివి వింటాం. కానీ కొంచెం అలాంటిదే ఈ కల్లక్కడల్‌(ఉప్పెన తరంగాలు). సముద్రంలో అకస్మాత్తుగాసంభవించే మార్పులను కల్లక్కడల్‌ అంటారు. సముద్రం ఒక్కసారిగా తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని ఐఎస్‌సీవోఐఎస్‌ తెలిపింది. హిందూ మహాసముద్రం దక్షిణ భాగంలో వీచే బలమైన గాలులకారణంగా సముద్రం అకస్మికంగా ఉప్పొంగే అవకాశం ఉంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ప్రాంతం నుంచి దక్షిణ హిందూ మహాసముద్రం వరకు వ్యాపించడం వలన కల్లక్కడల్‌ సంభవిస్తుందని పేర్కొంది. అయితే అలలు ఎప్పుడు ఎగసిపడతాయో మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version