https://oktelugu.com/

Sankranthiki Vasthunam : ఒకప్పుడు వెంకటేష్ పక్కన సౌందర్య ఎలాగో… ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ కూడా అలాగేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఎప్పుడైతే హీరోలందరు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారో అప్పటి నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అవుతున్నాయనే చెప్పాలి...

Written By:
  • NARESH
  • , Updated On : January 15, 2025 / 08:31 AM IST

    Sankranthiki Vasthunam

    Follow us on

    Sankranthiki Vasthunam : వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఇక సంక్రాంతి కానుకగా థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని ఎంటర్ టైన్ చేస్తూ ముందుకు దూసుకెళ్లడం నిజంగా మంచి విషయమనే చెప్పాలి. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడోవ సినిమాగా ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగడం అటు వెంకటేష్ ఫ్యాన్స్ ను ఇటు అనిల్ రావిపూడి అభిమానులను అలరిస్తుందనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో వీళ్ళిద్దరూ చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగినట్టుగా తెలుస్తోంది…ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా కేర్ ఫుల్ గా డీల్ చేస్తూ ముందుకు సాగారు. మరి ఎప్పుడైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిందో అప్పటినుంచి ఈ మూవీ మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్ రానున్న రోజుల్లో రిపీట్ అవుతూ భారీ విజయాల వైపు దూసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ కూడా తనదైన రీతిలో చక్కటి నటనను కనబరిచి ఒకప్పుడు వెంకటేష్ సౌందర్య మధ్య ఎలాంటి బాండింగ్, ఎలాంటి కెమిస్ట్రీ ఉండేదో మరోసారి అదే కెమిస్ట్రీని రిపీట్ చేశారనే చెప్పాలి.

    ఇక ఐశ్వర్య రాజేష్ తన ఇన్నోసెంట్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మైమరిపించింది…ఇక ఇప్పటివరకు ఆమెకు పెద్దగా మంచి సినిమాలైతే రాలేదు. అందువల్లే ఆమెలోని నటన ప్రతిభ బయటకి తెలియలేదు. ఇక ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఇప్పుడు తన నటన ప్రతిభను బయటికి తీసి చూపించాడు. కాబట్టి ఇక మీదట ఆమెకు మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.

    మరి ఆమె కనక ఇప్పుడు ఆ అవకాశాలను మంచిగా వాడుకున్నట్లయితే ఆమె కూడా స్టార్ హీరోయిన్ గా మారుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక నటనకు స్కోప్ ఉన్న పాత్రలో ఆమె నటిస్తే మాత్రం ఆమెకు చాలా మంచి ఆదరణ దక్కడమే కాకుండా గొప్ప గుర్తింపును కూడా తీసుకువస్తుందనే చెప్పాలి…

    వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ ల కాంబినేషన్ అయితే అల్టిమేట్ గా వర్కవుట్ అయిందంటూ సినిమా విమర్శకుల నుంచి కూడా ఈ పెయిర్ కి మంచి ప్రశంసలు అయితే దక్కుతున్నాయి. ఇక వెంకటేష్ పక్కన సౌందర్య తర్వాత అంత బాగా నటించి మెప్పించే నటి అయితే దొరకలేదు. ఇక వెంకీ తో పాటు కాంబినేషన్ ఎవ్వరికీ కుదరడం లేదు. కానీ ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ లా కాంబో నెక్స్ట్ లెవల్లో వర్కౌట్ అయింది…