Jobs: ఎడ్యుకేషనల్ ఎన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. చీఫ్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రిన్సిపల్ చీఫ్ కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీల కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. డేటా అనాలసిస్, ట్రైనింగ్ విభాగాలతో పాటు జెండర్ అండ్ ఈక్వాలిటీ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది.

రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం మార్చి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది.
Also Read: TDP- Janasena: ఏపీలో రోడ్ మ్యాప్ కోసం జనసేన రెడీనా?
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. https://www.edcilindia.co.in/tcareers వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి సమచారంను పొందే అవకాశం ఉంటుంది. కనీసం మూడేళ్ల నుంచి పది సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
నోటిఫికేషన్ లో సూచించిన విధంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్ధుల వయస్సు ఉండాలి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. న్యూఢిల్లీలోని ఈ సంస్థ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.
Also Read: RRR Promotions: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్.. డ్రెస్ కోడ్ తో తగ్గేదేలే అంటున్న రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్