RRR Promotions: ఆర్ఆర్ఆర్ మేనియాను మరోసారి పతాక స్థాయికి తీసుకెళ్లేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ ఈ మేరకు ప్రమోషన్ మొదలుపెట్టారు. తాజాగా హైదరాబాద్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తొలి ప్రమోషన్ ను రాజమౌళి తన ఇద్దరు హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లతో మొదలుపెట్టారు. అదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా లోగో ముద్రించిన డ్రెస్ లను వేసుకొని వీరు హైదరాబాద్ లో ప్రమోషన్ కు వచ్చారు. ఎన్టీఆర్ ఫుల్ బ్లాక్ కలర్ డ్రెస్ లో కొంచెం సీరియస్ గానే కనిపిస్తుండగా.. రాంచరణ్ బ్లూ షర్ట్ లోపల నెక్ తో కొంచెం స్టైలిష్ అవతారంలోకి వచ్చాడు.

ఆర్ఆర్ఆర్ ఈనెల 25న రిలీజ్ అవుతోంది. ఈ ఇద్దరు అగ్రహీరోలతో రాజమౌళి మరోసారి హైదరాబాద్ లో ప్రమోషన్ షురూ చేశారు. ఈ క్రమంలోనే బాహుబలి కంటే కూడా ఆర్ఆర్ఆర్ సినిమా పెద్దది అంటూ రాజమౌళి సంచలన ప్రకటన చేశారు.

ఎన్టీఆర్ ఓ సూపర్ కంప్యూటర్ లాంటివాడు అని రాజమౌళి కితాబిచ్చాడు. ఇక షూటింగ్ టైమ్ లో చాలాసార్లు చరణ్ తన నటనతో తనను ఆశ్చర్యానికి గురిచేశాడని ప్రశంసించాడు.

తెలుగు సినిమా కొత్త దశకు చేరుకుంటోందని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ఇకపై టాలీవుడ్ నుంచి మరిన్ని మల్టీ స్టారర్ లు సినిమాలు ఆశించవచ్చన్నాడు. చరణ్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని పేర్కొన్నాడు. ఇక తనకు బాబాయ్ బాలకృష్ణతోపాటు చిరంజీవి, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ లతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయాలని ఉందని ఎన్టీఆర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

Also Read: Venkatesh Chanti Movie Child Artist: ‘చంటి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా ?
[…] SS Rajamouli Interview: రాజమౌళి.. క్రియేటివిటీకి అండ్ విజువల్ సెన్స్ కి సింబాలిజం, కమర్షియల్ సినిమాలకు పర్ఫెక్ట్ డెఫినిషన్. రాజమౌళి పాత్రల్లో యాక్షన్ ఉంటుంది. రాజమౌళి యాక్షన్ లో ఎమోషన్ ఉంటుంది. కాగా జక్కన డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ గా రాబోతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ నెల 25న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రాజమౌళి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం. […]
[…] NTR Comments On RRR Movie: ఈ నెల 25న విడుదల కానున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం భారతీయ సినీ లోకం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొత్త సంచనాలను సృష్టించడానికి ఈ క్రేజీ మల్టీస్టారర్ అన్ని రకాలుగా సన్నద్ధం అయ్యింది. మరోపక్క ఈ చారిత్రాత్మక చిత్రానికి సంబంధించిన ముచ్చట్లు చెప్పడానికి చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. […]
[…] Hero Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాకి బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా లెక్కల వ్యవహారం అస్సలు బాగాలేదు. విడుదలైన అన్ని చోట్ల నేటితో కలెక్షన్స్ సగానికి పడిపోయాయి. అయితే, ఈ సినిమా కోసం గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్ థియేటర్ వద్ద 37 ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే ప్రభాస్ ఫ్యాన్ భారీ ఫ్లెక్సీ కట్టే క్రమంలో చనిపోయాడు. […]