Chapaathi: ప్రతిరోజు చపాతీలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Chapathi: ప్రస్తుత కాలంలో చాలా మంది వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అధిక శరీర బరువు పెరగటం వల్ల చాలామంది శరీర బరువు తగ్గడానికి డైట్ లో భాగంగా ప్రతిరోజు చపాతీ తినడం అలవాటు చేసుకున్నారు. అయితే ప్రతిరోజు చపాతి తినకూడదని కొందరు చెబుతుంటారు. కానీ ప్రతి రోజూ చపాతి తినడం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం… గోధుమ పిండిలో తక్కువ క్యాలరీలు ఉండటమే కాకుండా ఎక్కువగా ఫైబర్లు […]

Written By: Navya, Updated On : April 15, 2022 6:57 pm
Follow us on

Chapathi: ప్రస్తుత కాలంలో చాలా మంది వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అధిక శరీర బరువు పెరగటం వల్ల చాలామంది శరీర బరువు తగ్గడానికి డైట్ లో భాగంగా ప్రతిరోజు చపాతీ తినడం అలవాటు చేసుకున్నారు. అయితే ప్రతిరోజు చపాతి తినకూడదని కొందరు చెబుతుంటారు. కానీ ప్రతి రోజూ చపాతి తినడం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

Chapaathi

గోధుమ పిండిలో తక్కువ క్యాలరీలు ఉండటమే కాకుండా ఎక్కువగా ఫైబర్లు ఉంటాయి. అలా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ తో పాటు
విటమిన్ బి, ఇలతో పాటు కాపర్, జింక్, మాంగనీస్, పొటాషియం, క్యాల్షియం, అయోడిన్ వంటి పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే ప్రతి రోజూ చపాతి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చపాతిలో ఉన్న పోషక విలువల కారణంగా ఊబకాయం, అనీమియా, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే గర్భధారణ సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Also Read: ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారా.. ఆ సమస్యలు వచ్చే అవకాశం?

ఇది మాత్రమే కాకుండా గోధుమ పిండిలో ఉండే పోషకాల వల్ల చర్మం డీహైడ్రేషన్ కాకుండా ఎల్లప్పుడు హైడ్రేట్ అవుతుంది. దీంతో చర్మ కాంతి మెరుగుపడుతుంది. అలాగే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉండడం వల్ల శరీర బరువును తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తూ మలబద్దకాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అందుకే ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు అన్నం బదులు చపాతీ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా శరీర బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ ను నిరోధిస్తుంది.

Also Read: క్యాబేజీ కర్రీ చేస్తున్నప్పుడు ఈ పొరపాటు చేస్తే మాత్రం అనారోగ్యం పాలవ్వాల్సిందే?