Early Knee Pain Age 30: సాధారణంగా ఒక పని చేసే సమయంలో గానీ.. ఆహారం తినే సమయంలో గానీ.. ఇతరులతో ప్రశాంతంగా మాట్లాడే సమయంలో గానీ కూర్చునే ఉంటాం. ఒకప్పుడు కూర్చోవడానికి కుర్చీలు, సోఫా సెట్లు అందుబాటులో లేవు. దీంతో నేలపైన ఎక్కువ శాతం కూర్చునేవారు. నేలపై కూర్చొని ఎవరి సహాయం లేకుండా పైకి లేచేవారు. ఇలా వృద్ధుల వరకు స్వతహాగా కూర్చుని, నిలుస్తూ ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో 30 ఏళ్ల లోపు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దీంతో ఇతరుల సహాయం లేకుండా కూర్చుని లేచి నిలిచే పరిస్థితి లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలో వీరిలో మరణాల రేటు ఎలా ఉంటుందని బ్రెజిల్ చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వారి పరిశోధన ఎలా ఉందంటే?
ప్రస్తుత కాలంలో చాలామంది కింద కూర్చోవడం లేదు. కుర్చీల్లో గాని.. సోఫా సెట్లో గాని.. ఇతర వస్తువులపై గాని కూర్చుంటున్నారు. అందుకు కారణం మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉండటమే. సమాజంలో కల్తీ ఆహారం ఎక్కువగా రావడంతో.. వీటిని తిన్న చాలా మంది చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతున్నారు. ఇందులో భాగంగా చాలామంది తిని తిండిలో కాల్షియం తక్కువ అవుతుంది. దీంతో బోన్స్ లో బలం లేకుండా పోతుంది. ఫలితంగా మోకాళ్ల నొప్పులు ఎక్కువగా అవుతున్నాయి. ఇలా చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు రావడంతో.. ఇతరుల సహాయంతో కూర్చుంటున్నారు.. మళ్లీ ఇతరుల అవసరం లేకుండా నిలుచుకోవడం లేదు.
Also Read: Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా? .. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి
అయితే వీరిలో మరణాల రేటు ఎలా ఉంటుందని బ్రెజిల్ చెందిన ‘సిట్టింగ్ రైసింగ్ టెస్ట్ ‘ అనే పరిశోధన ద్వారా కొందరు శాస్త్రవేత్తలు వివరాలు తెలుసుకున్నారు.వీరు 46 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్న 4300 మందిని తీసుకున్నారు. వీరిపై 12 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు. ముందుగా వీరికి కొన్ని స్కోరును కేటాయించారు. కూర్చొని, నిలబడడానికి ఇతరుల సహాయం తీసుకున్న వారికి ఒక్కో పాయింటును ఇచ్చారు. కూర్చొని స్థిరత్వం లేకుండా ఉన్నవారికి 0.5 పాయింట్లు తగ్గించారు. అయితే 12 ఏళ్ల సమయంలో 665 మరణాలు జరిగాయి. ఈ మరణాలను పరిశీలిస్తే తక్కువ ఎస్ఆర్టి స్కోరు ఉన్నవారికి అధికంగా మరణ ప్రమాదం ఉందని గుర్తించారు. అంటే తక్కువ ఎస్ఆర్టి స్కోరు ఉన్నవారు 42% మరణిస్తే . ఎక్కువ స్కోరు నమోదైన వారు 3.7% మరణాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువగా గుండెజాబ్బులతోనే మరణించినట్లు తెలుసుకున్నారు.
అయితే గత 25 ఏళ్లలో సమాజంలో ఇతర గ్రూపులలో ఇలాంటి పరీక్షలు చేశామని. ఇవి విజయవంతంగా పూర్తయ్యాయని పరిశోధకులు చెప్పారు. అంతేకాకుండా ఇలా పరీక్ష చేయడం చాలా సులభం అని కూడా పేర్కొన్నారు.