Knee Pain: ఇటీవల కాలంలో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. గతంలో అరవై ఏళ్లు వచ్చినా రాని నొప్పులు ఇప్పుడు నలభై ఏళ్లకే బాధిస్తున్నాయి. దీనికి కారణం సమతుల్య ఆహారం తీసుకోకపోవడమే. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అందరు మాంసాహారాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా లభించే పదార్థాలపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయి. ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో కీళ్లు, మోకాళ్లు, నడుము నొప్పులు బాధిస్తున్నాయి. కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనంగా మారుతున్నాయి.

దీంతో చిన్న ప్రమాదాలకే ఎముకలు విరగడం జరుగుతుంది. కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాల్షియం ఉండే ఆహారం తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. దీనికి ఓ ఆహారం తీసుకుంటే చాలు. మన నొప్పులకు చెక్ పెట్టొచ్చు. అటుకులు, పెరుగుతో ఓ వంటకం తయారు చేసుకుంటే పరిష్కారం లభిస్తుంది. దీనికి ముందుగా కడాయిలో ఆలివ్ నూనె వేసి వేడి చేసుకోవాలి. తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మునగాకు, పసుపు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసుకుని వేయించాలి. తరువాత నానబెట్టుకున్న అటుకులు నీళ్లు పిండి వేసుకుని కలుపుకోవాలి.
అటుకులు వేగిన తరువాత పెరుగు, కొ్త్తిమీర వేసుకుని కలుపుకోవాలి. రెండు నిమిషాలు కలుపుకుని తరువాత తీసుకుంటే సరిపోతుంది. దీంతో మోకాళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. ఇంకా మనం తీసుకునే పాలల్లో కూడా కాల్షియం ఉంటుంది. కానీ ఎవరు కూడా పాలు తాగేందుకు ఇష్టపడరు. నువ్వుల్లో కూడా కాల్షియం మెండుగా ఉంటుంది. రోజు భోజనం చేశాక ఓ నువ్వుల ముద్ద ఆహారంగా తీసుకుంటే మోకాళ్ల నొప్పులు ఇట్టే మాయమవుతాయి. వీటిని పాటించి మోకాళ్ల నొప్పుల నుంచి దూరం కావచ్చు.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు అటుకులను ఆహారంగా తీసుకుంటే ప్రయోజనమే. ఇంకా ఉప్పును తగ్గించి తీసుకోవడం కూడా మంచిదే. ఎప్పుడు కూడా మనకు నష్టం కలిగించే వంటకాలను దూరం పెడితే లాభాలు ఉంటాయి. కానీ చాలా మంది ఈ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫలితంగా మోకాళ్ల నొప్పులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. దీనికి గాను వైద్యులు సూచించిన విధంగా ఆహారం తీసుకుని మోకాళ్ల నొప్పులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుంచుకోవాలి.