Homeలైఫ్ స్టైల్Dussehra Holidays 2025: దసరా సెలవులు ఎప్పటినుంచంటే?

Dussehra Holidays 2025: దసరా సెలవులు ఎప్పటినుంచంటే?

Dussehra Holidays 2025: తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పండుగలు దసరా, దీపావళి, సంక్రాంతి. వీటిలో ముందుగా వచ్చేది దసరా పండుగ. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. తెలంగాణలో అయితే దసరాకు ముందు తొమ్మిది రోజులపాటు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు మహిళలు అంతా ఒక్కచోట చేరి కూడళ్లలో, ప్రత్యేక స్థలాల్లో బతుకమ్మలను తీసుకువచ్చి ఆటలు ఆడుతారు. పాటలు పాడుతారు. అయితే ఈ పండుగ సంతోషాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం దసరా పండుగకు ప్రత్యేక సెలవులను ప్రకటిస్తుంది. ముఖ్యంగా విద్యాసంస్థలకు దాదాపు వారం రోజులపాటు సెలవులను మంజూరు చేస్తుంది. అయితే ఈ ఏడాది దసరా సెలవులు ఎప్పుడు అని చాలామంది ఎదురుచూస్తున్నారు. అసలు దసరా సెలవులు ఎప్పుడూ అంటే?

ప్రతి సంవత్సరం ప్రభుత్వం సెలవులపై అకాడమీ క్యాలెండర్ విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ఏపీ, తెలంగాణలో సెలవుల గురించి ఇప్పటికే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో రెండు రోజులు ఎక్కువగా సెలవులు రానున్నాయి. అక్టోబర్ రెండున దసరా పండుగ నిర్వహించడంతో దీనికంటే తొమ్మిది రోజులు సెలవులు ప్రకటించారు. మొత్తం తెలంగాణలో 12 రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 10 రోజులు సెలవులు ఇవ్వనున్నారు.

దసరా సెలవుల్లో విద్యాసంస్థలు మాత్రమే సెలవులు ఉంటాయి. మిగతా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు యధావిధిగా కొనసాగుతాయి. అయితే అక్టోబర్ రెండు న ప్రభుత్వ సంస్థలతో పాటు బ్యాంకు వ్యవహారాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఫైనాన్స్ విషయంలో ఉండే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇక దసరా తెలుగులో సందర్భంగా విద్యార్థులు హాస్టల్లో నుంచి తమ ఇంటికి వెళ్తారు. మహిళలు పుట్టింటికి వస్తారు. ఈ సందర్భంగా తొమ్మిది రోజులపాటు ప్రతిరోజు బతుకమ్మలను పేరుస్తూ కూడళ్ళలో ఆడుతూ ఉంటారు. చివరి రోజున పెద్ద బతుకమ్మను పేర్చి ఊరు లేదా పట్టణ ప్రజలు అంతా ఒక చోటుకు చేరి సంతోషంగా గడుపుతారు. దసరా రోజు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

విదేశాల్లో ఉండేవారు సైతం దసరా పండుగకు తమ పుట్టింటికి వస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు అంతా కలిసి సంతోషంగా ఉండగలుగుతారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని క్రైస్తవ విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రత్యేకంగా ప్రకటించారు. ఈ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే ఉండనున్నాయి. ఈ షెడ్యూల్ ఆ పాఠశాల విద్యార్థులతో పాటు సిబ్బందికి కూడా వర్తిస్తుంది.

అయితే దసరా సెలవులు తెలంగాణలో అక్టోబర్ 3తో ముగుస్తున్నాయి. కానీ 4వ తేదీ ఒకరోజు వర్కింగ్ డే అవుతుంది. మళ్లీ 5వ తేదీ నాడు మిలాన్ ఉన్ నబీ ఉండనుంది. దీనికోసం ప్రత్యేకంగా సెలవును ప్రకటించారు. ఈరోజు ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు కూడా మూతపడే అవకాశం ఉంది. ఇలా దసరా సెలవులు పూర్తికాగానే మరోరోజు సెలవు వచ్చే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version