Tea On Empty Stomach: మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఆంగ్లేయులు చేసిన అలవాటు ఇప్పుడు అందరికి వ్యసనంగా మారింది. దీంతో టీ తాగడం వల్ల ఎన్నో అనర్థాలున్నాయని తెలిసినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కొందరికి ఉదయం లేవగానే టీ తాగనిదే దినచర్య మొదలు కాదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో టీ తాగే అలవాటు మానుకోవాలని చెబుతున్నా లెక్కచేయడం లేదు.
ఉదయాన్నే టీ తాగడం వల్ల పండ్లలో ఉండే ఎనామిల్ దెబ్బ తింటుందని చెబుతున్నారు. పరగడుపున టీ తాగడం మంచిది కాదు. ఖాళీ కడుపుతో టీ తాగితే అనారోగ్యమే. ఖాళీ కడుపుతో టీ తాగితే పేగులలో పొర ఏర్పడుతుంది. అంతకుముందు గోరువెచ్చని నీళ్లు తాగాలి. టీ పరగడుపున తాగితే నష్టాలే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా పరగడుపున టీ తాగడం మంచిది కాదు.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటి సమస్య ఏర్పడుతుంది. నిత్యం ఇలా తాగితే పొట్టలో ఆమ్లం పెరిగి ఆరోగ్యం చెడిపోతుంది. అందుకే ఖాళీ కడుపుతో టీ తాగడం సురక్షితం కాదు. దీంతో దంతాల బయటి పొర క్షీణించి దంతక్షయం ప్రమాదాన్ని పెంచుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. కళ్లు తిరగడంతో పాటు మలబద్ధకం, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఇబ్బందులున్నాయని తెలిసినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. టీ తాగే ముందు నీళ్లు తాగాలి. టీతో పాటు ఏదైనా తినడం అలవాటు చేసుకోవడం వల్ల కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది. టీ తాగడానికి 10-15 నిమిషాల ముందు నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ఇలా టీ తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అంతేసంగతి.