https://oktelugu.com/

Help: చిన్న సాయాలకు మోసపోవద్దు.. ఎలా అంటే??

సహజంగానే స్త్రీలు ఎక్కువ భావోద్వేగాలకు గురవుతారని పలువురు చెబుతున్నప్పటికీ కొన్ని అధ్యయనాలు ఈ విషయాన్ని తోసిపుచ్చాయన్న సంగతి కూడా తెలిసిందే. ఉదహరణకు ఇంటి పక్కన కొత్తగా అద్దెకు వచ్చిన వారు ఏదైనా సాయం చేస్తే చాలు.. వారిపై ఎంతో పాజిటివ్ ఫీలింగ్ ను ఏర్పరచుకుంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 4, 2024 / 03:45 PM IST

    Help

    Follow us on

    Help: సాధారణంగా స్త్రీలు సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే చిన్న చిన్న విషయాలను కూడా మనసులోకి తీసుకుంటారట. అయితే పురుషుల కంటే స్త్రీలు మానసికంగా చాలా ధృడంగా ఉంటారని చెబుతుంటారు. కానీ వారి శక్తిని ఎలా వినియోగించుకోవాలో తెలియక స్త్రీలు మోసపోతుంటారని కొందరు చెబుతుంటారు. అంతేకాదు ఎవరైన చిన్న ఉపకారం చేసిన కూడా వెంటనే స్త్రీ హృదయం స్పందిస్తుందని పెద్దలు తెలియజేస్తున్నారు.

    స్త్రీలు లాలిత్యం, సున్నితత్వాన్ని కలిగి ఉండటం వలన దేన్నైనా మనసులోకి తీసుకుంటారట. అందుకే తెలియని వారు చిన్న సాయం కానీ, ఉపకారం కానీ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతారట. అయితే అది మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు దీని వలన అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళలు అంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

    సహజంగానే స్త్రీలు ఎక్కువ భావోద్వేగాలకు గురవుతారని పలువురు చెబుతున్నప్పటికీ కొన్ని అధ్యయనాలు ఈ విషయాన్ని తోసిపుచ్చాయన్న సంగతి కూడా తెలిసిందే. ఉదహరణకు ఇంటి పక్కన కొత్తగా అద్దెకు వచ్చిన వారు ఏదైనా సాయం చేస్తే చాలు.. వారిపై ఎంతో పాజిటివ్ ఫీలింగ్ ను ఏర్పరచుకుంటారు. పొందింది చిన్న సాయమే అయినా ఎదుటి వారిని అతిగా నమ్మేస్తుంటారట. అయితే ఈ విధంగా నమ్మటం అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాదని చెబుతున్నారు. మన నమ్మకాన్ని కొందరు దుర్వినియోగ పరిచే అవకాశాలు ఉన్నాయి. నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేసే ఛాన్స్ కూడా ఉందని పేర్కొంటున్నారు. అలా అని అందరూ అదే తరహాలో ఉంటారని కూడా చెప్పలేం.

    ఒక మనిషిని అంచనా వేయగలిగితే ఇటువంటి మోసాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరి వద్ద అయినా మనం సాయం తీసుకున్నప్పుడు కృతజ్ఞత భావం చూపించడంలో తప్పు లేదు. కానీ అందరిని అతిగా నమ్మకూడదని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే తెలియని వారి చేసిన సాయంపై, పరోపకారంపై కాస్త అప్రమత్తంగా ఉండటంలో తప్పు లేదని తెలుస్తోంది.