https://oktelugu.com/

MI Vs KKR 2024: మీ దేడ్ దిమాక్ నిర్ణయాలతో ముంబై జట్టును ముంచారు కదరా..

ప్రస్తుతం ముంబై జట్టు 6 పాయింట్లు మాత్రమే కలిగి ఉంది. ఈ పాయింట్ లతో ప్లే ఆఫ్ వెళ్లడం దాదాపు అసాధ్యం. అంటే ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు, లీగ్ దశలోనే ఇంటికి వెళుతుందన్నట్టు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 4, 2024 3:52 pm
    MI Vs KKR 2024

    MI Vs KKR 2024

    Follow us on

    MI Vs KKR 2024: ఐదుసార్లు ఛాంపియన్.. అద్భుతమైన ఆటగాళ్లు.. ఎంతైనా ఖర్చు పెట్టగల యాజమాన్యం.. చేతిలో ఎన్నో సౌకర్యాలు.. ఇలాంటి జట్టు ఎలా ఆడాలి? కానీ ఎలా ఆడుతోంది.. ఇలా అవడానికి కారణం ఎవరు.. ఇప్పుడు ఈ చర్చ మొత్తం ముంబై ఇండియన్స్ జట్టు గురించే.. ఈ ఐపీఎల్లో మోస్ట్ వాంటెడ్ జట్టుగా.. కచ్చితంగా కప్ గెలుస్తుందని అభిమానులు భావించిన జట్టుగా.. ముంబై ఇండియన్స్ బరిలోకి దిగింది. కానీ, అంచనాలకు తగ్గట్టుగా ఆడటంలో ముంబై జట్టు విఫలమైంది. 11 మ్యాచులు ఆడితే.. మూడు మ్యాచ్ లలో గెలిచి.. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.. గెలవాల్సిన మ్యాచ్ లలో ఓటమిపాలై పరువు తీసుకుంది. అంతేకాదు ప్లే ఆఫ్ ఆశలను గంగలో కలిపేసుకుంది.

    ప్రస్తుతం ముంబై జట్టు 6 పాయింట్లు మాత్రమే కలిగి ఉంది. ఈ పాయింట్ లతో ప్లే ఆఫ్ వెళ్లడం దాదాపు అసాధ్యం. అంటే ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు, లీగ్ దశలోనే ఇంటికి వెళుతుందన్నట్టు. ఈ పరిణామాన్ని ముంబై జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. వాస్తవానికి వారు ముంబై జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించిన నాటి నుంచే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ ముంబై జట్టు యాజమాన్యాన్ని సోషల్ మీడియా వేదికగా దెప్పి పొడిచారు.

    ఇక, శుక్రవారం రాత్రి కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు సొంత మైదానంలో 24 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. 170 పరుగుల స్కోర్ చేయలేక ఆల్ అవుట్ అయింది. రోహిత్ శర్మ, కిషన్, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, వంటి మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఆ జట్టు సొంత మైదానంలో విజయాన్ని దక్కించుకోలేకపోయింది. సూర్య కుమార్ యాదవ్ మాత్రమే 35 బంతుల్లో 56 పరుగులు చేయగలిగాడు. టిమ్ డేవిడ్ ఉన్నంతలో కాస్త కోల్ కతా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

    ముంబై జట్టు అత్యంత దారుణమైన ఆటతీరు ప్రదర్శించడంతో టీమిండియా ఒకప్పటి ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు..”ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై జట్టు ఇలా ఆడుతుండడం బాధగా అనిపిస్తున్నది.. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు ముంబై జట్టుకు శాపంగా మారాయి. కోల్ కతా జట్టు ఈ మ్యాచ్ లో అండ్రీ రస్సెల్ ను ఆలస్యంగా పంపించి మూల్యం చెల్లించుకున్నది. ఆ లెక్కన ముంబై జట్టు కూడా అదే తప్పు చేసింది.. హార్దిక్ పాండ్యా, డేవిడ్ ను నిదానంగా పంపించింది. దీనివల్ల ఏం మేలు జరిగిందని” సెహ్వాగ్ పేర్కొన్నాడు. కొంతమంది ప్లేయర్లపై మేనేజ్మెంట్ కఠిన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. అప్పుడే ముంబై జట్టు బాగుపడుతుందని పేర్కొన్నాడు.