https://oktelugu.com/

KGF Star: కేజీఎఫ్ స్టార్ కి వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు… ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న యశ్…

కేజిఎఫ్ సిరీస్ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది కన్నడ డైరెక్టర్లు ముందుకు వచ్చారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 4, 2024 / 03:42 PM IST
    Telugu directors are not showing much interest in making a film with Yash

    Telugu directors are not showing much interest in making a film with Yash

    Follow us on

    KGF Star: కేజీఎఫ్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో యశ్..ఈయన చేసిన కేజిఎఫ్ సిరీస్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన భారీ సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడు. అయితే ఆయన చేసిన కేజిఎఫ్ సిరీస్ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది కన్నడ డైరెక్టర్లు ముందుకు వచ్చారు. కానీ తెలుగు డైరెక్టర్లు మాత్రం ఆయనతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

    ఇక ఇప్పుడు యశ్ కి అదే పెద్ద చిక్కు గా మారుతుంది. ఎందుకంటే కన్నడ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్లతో సినిమాలు చేస్తే ఆయన రేంజ్ కు తగ్గట్టుగా వాళ్ళు సినిమాలను హ్యాండిల్ చేయగలరా లేదా అనే ఒక డైలమాలో అయితే ఆయన అన్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళని వదిలేసి ఇతర భాషల డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. మరి వేరే భాషల్లోని డైరెక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు.

    ఇక అప్పట్లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో యష్ ఒక సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చినప్పటికీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు ఏ సినిమా చేస్తున్నాడో కూడా సరైన క్లారిటీ అయితే ఉండడం లేదు. అందువల్ల కే జి ఎఫ్ తో ఎలాంటి క్రేజ్ అయితే సంపాదించుకున్నాడో ఆయనకి ఇప్పుడు అంత క్రేజ్ అయితే లేదనే టాకైతే వినిపిస్తుంది.

    ఇక పాన్ ఇండియా సినిమాల విషయానికి వస్తే తెలుగు హీరోల గురించి మాట్లాడుతున్నారు తప్ప కన్నడ, మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఇక అందులో భాగంగానే యశ్ తనకు సరైన డైరెక్టర్ దొరకక ఏ సినిమా చేయాలో తెలియక చాలా వరకు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది…