Holiday: ప్రతిరోజు ఏదో ఒక పనితో బిజీగా ఉంటారు చాలామంది. ఉద్యోగం, వ్యాపారం చేసేవారు గురుకుల పరుగుల జీవితాలతో గడుపుతారు. నీతో మానసికంగా, శారీరకంగా ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. అయితే ఈ శ్రమను మర్చిపోవడానికి ప్రతి వారంలో ఒకరోజు విశ్రాంతి తీసుకోవడానికి హాలిడే ఇస్తుంటారు. కానీ చాలామంది ఈ హాలిడే రోజు కూడా ఏదో ఒక వర్క్ చేస్తుంటారు. ఇలా చేయకుండా ఈ హాలిడేని చాలీగా గడిపేస్తూ ఎంజాయ్ చేయాలి. అలా చేయడంవల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాకుండా రిఫ్రిష్ అయి మరుసటి రోజు నుంచి వారం రోజులపాటు పనిచేసే శక్తి వస్తుంది. మరి ఈ వీకెండ్ రోజు ఏం చేయాలి? ఏం చేస్తే ఉల్లాసంగా మారుతారు?
కొంతమంది వారం రోజులపాటు పనుల కారణంగా బిజీగా ఉన్నామని.. సెలవు రోజు నిద్రపోవాలని అనుకుంటారు. కానీ ఇలా నిద్రపోకుండా ఉదయాన్నే లేవడం మంచిది. ఉదయం ఇంటికి ఉన్న కిటికీలు అన్నీ ఓపెన్ చేయాలి. అలాగే డోర్లు కూడా క్లోజ్ చేయకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వస్తుంది. ఈ గాలిలో హాయిగా ఉంటూ టీ తాగుతూ గడపండి. ప్రతిరోజు ఎలాగో ఉరుకులు, పరుగులతో టీ తాగుతూ ఉంటారు. అందువల్ల ఈరోజు టెర్రస్పై కూర్చొని ప్రశాంతంగా టీ తాగుతూ కాసేపు అక్కడే గడపండి. ఇలా చేయడం వల్ల శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకున్నట్లు అవుతుంది. అంతేకాకుండా చిన్నపాటి గార్డెన్ ఏర్పాటు చేసుకొని అందులో కాసేపు ఉండడంవల్ల స్వచ్ఛమైన గాలి వస్తుంది.
సెలవు రోజు బ్రేక్ ఫాస్ట్ తోపాటు ఆహారాన్ని కూడా ఓన్ గా తయారు చేసుకోవాలి. వారంలో ఆరు రోజులపాటు బిజీగా ఉండడంతో కొన్నిసార్లు బయటి ఫుడ్ తినాల్సి వస్తుంది. అయితే ఈరోజు మాత్రం సొంతంగా వండుకొని తిని రుచి చూసే ప్రయత్నం చేయాలి. పెళ్లి అయిన వారు అయితే ఆడవారికి విశ్రాంతి కల్పించి వారి బదులు మీరు వంట చేయండి. ఇలా చేస్తే ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రతిరోజు ఎలాగో ఎవరి పనులతో వారు బిజీగా ఉంటారు. సెలవు రోజు మాత్రం అందరూ కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేసే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వైరం తొలగిపోతుంది.
సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్కు వెళ్ళండి. లేదా సమీపంలోని పార్క్, జలాశయాలు ఉంటే అక్కడికి వెళ్లి గడపవచ్చు. ఈరోజు షాపింగ్ చేయడం వల్ల కాస్త రిలాక్స్ అవుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి కొత్త వస్తువులను కొన్ని ప్రయత్నం చేయాలి. అయితే బ్యాచిలర్ గా ఉంటే స్నేహితులను ఇంటికి పిలిచి వారికి ఒకరోజు విందు ఏర్పాటు చేయండి. ఇక రాత్రి సమయంలో ప్రశాంతమైన మ్యూజిక్ వింటూ నిద్రపోవాలి. ఇలా సెలవు రోజున ప్రత్యేకంగా ప్లాన్ చేసుకొని హాయిగా గడపాలి. ఈ రోజున మానసికంగా ఇబ్బందులు ఉండే పనులను ఏర్పాటు చేసుకోవద్దు. అలాగే ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించిన పనులను కూడా పక్కన పెట్టడం మంచిది.