Assam: ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే.. మరోవైపు నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. కొంతమంది వద్ద డబ్బు ఎక్కువగా ఉండి.. మరి కొంతమంది వద్ద తక్కువగా ఉండడంతో డబ్బు కోసం లేదా నగల కోసం దొంగతనాలు పెరిగిపోతున్నాయి. దొంగతనాలకు పాల్పడిన వారిని కొన్ని రోజులపాటు జైల్లో ఉంచి ఆ తర్వాత విడుదల చేస్తున్నారు. అయితే ఇలా విడుదల అయిన వారిలో కొంతమంది మాత్రమే మంచి వారిగా తయారవుతున్నారు. మరికొంతమంది మాత్రం అవే నేరాలు కొనసాగిస్తున్నారు. అయితే వీరికి సరైన విధంగా శిక్ష లేదని కొందరు ఆశిస్తూ ఉంటారు. వాస్తవానికి నేరాలు చేసిన వారికి శిక్షలు కాస్త కఠినంగానే ఉంటాయి. ఈ శిక్షలకు భయపడే చాలామంది మరోసారి నేరం చేయకుండా ఉంటారు. కానీ కొందరు పోలీసులు మాత్రం దొంగలకు విభిన్నమైన శిక్షలు విధించారు. ఈ శిక్ష ఎలా ఎలా ఉందంటే?
ఒక వ్యక్తి దొంగతనం చేసిన తర్వాత అతని ముందుగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. నేరం రోజు అయితే జైల్లో వేస్తారు. అయితే జైలులో వారి నేరాన్ని బట్టి శిక్షలు ఉంటాయి. కొందరికి సాధారణ శిక్షలు.. మరికొందరికి కఠిన కారాగార శిక్షలు ఉంటాయి. అస్సాం లోని శివసాగర్ జిల్లా థయాలిలో ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. సాధారణంగా ఇలా పట్టుకున్న వారిని కొందరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పజెప్తారు. మరికొందరు స్థానికంగానే దేహశుద్ధి చేస్తారు. కానీ ఇక్కడి గ్రామస్తులు మాత్రం పట్టు పడిన వారిని వినూత్నంగా శిక్షించారు.
వారిని ఎండలో నిల్చోపెట్టి కొన్ని పాటలకు డ్యాన్సులు చేయించారు. అలా నాన్ స్టాప్ గా రెండు గంటల పాటు డాన్స్ చేసేలా పాటలు వేయించారు.. స్థానికులు చెప్పిన ప్రకారంగా ఇద్దరు ఎండలో నిల్చుని రెండు గంటల పాటు డాన్స్ చేశారు. అయితే ఆ తర్వాత తీవ్రంగా అలసిపోవడంతో వారికి ఛాయతో పాటు బిస్కెట్లు ఇచ్చారు. అనంతరం వారిని పోలీసులకు అప్పచెప్పారు. అయితే ఇలా ఎండలో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్ని ప్రదేశాల్లో ఇలా దొంగలు కట్టుపడితే వారికి దేహశుద్ధి లేదా ఇతర దాడులు చేస్తూ ఉంటారు. కానీ వినూత్నంగా వారితో డాన్స్ చేయించి పోలీసులకు అప్పచెప్పడంపై తీవ్ర చర్చనీయాంశం అయింది. వారికి పనిష్మెంట్ గా ఇలా ఇవ్వడంపై కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు దీనిపై విమర్శిస్తున్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు అప్పచెప్పాలని.. ఇలా ఎవరికి వారు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది.