
Fat Reduce: ఇటీవల కాలంలో చాలా మంది కొవ్వుతో బాధపడుతున్నారు. దీంతో గుండె జబ్బుల ముప్పు కలుగుతోంది. దీన్ని బెల్లీ ఫ్యాట్ అని చెబుతున్నారు. మారుతున్న జీవనశైలిలో మన అలవాట్లు మనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాకుండా పోతోంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం సహజమే. ఈ నేపథ్యంలో కొవ్వును కరిగించుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలి. దీనికి గాను రోజుకో గంట వ్యాయామమో, యోగానో చేస్తూ ఉండాలి. రోజుకో గంట పాటు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు ఎక్సర్ సైజులు చేయాల్సి ఉంటుంది.
ఫ్యాట్ ఎందుకు వస్తుంది?
ప్రతి రోజు కదలకుండా కూర్చుని పని చేసే వారికి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. గంటల తరబడి కూర్చుని పని చేసే వారు ప్రతి అరగంటకో మారు లేచి అటు ఇటు తిరడం చేస్తుండాలి. మెట్లు ఎక్కే అవకాశం ఉంటే లిఫ్ట్ వాడరాదు. సమయానుకూలంగా తినాలి. టైం తప్పి తినడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే క్రమబద్ధంగా అలవాటు చేసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా ఎక్సర్ సైజులు చేస్తుండాలి. అప్పుడే కొవ్వు కరుగుతుంది.
ఎక్సర్ సైజు..
ఒక గ్లాస్ నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అందులో ఒక చెంచా దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ నీరు గోరువెచ్చగా అయ్యాక అందులో నిమ్మరసం కలుపుకోవాలి. అందులో బెల్లం ముక్క కలుపుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ప్రతి రోజు పరగడుపున ఈ టీ తాగుతూ ఎక్సర్ సైజులు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి షుగర్, బీపీ వంటి రోగాలు అదుపులో ఉంటాయి. ఉదయం లేచిన తరువాత కాఫీ, టీలు తాగడం అంత సురక్షితం కాదు

కొవ్వు శాతం పెరగకుండా..
ఇలా మన ఫ్యాట్ ను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొవ్వు ఎక్కువైతే కష్టమే. ఎల్ డీఎల్ కొవ్వు పెరగడం వల్ల గుండె రంధ్రాలు మూసుకుపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనకు మేలు చేసే కొవ్వు హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్. ఈ క్రమంలో గుండె పనితీరు మెరుగుపడాలంటే మన శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు ఆరో్గ్యం సహకరిస్తుంది. కొవ్వు శాతం పెరగడం వల్ల అన్నింటికి తిప్పలు ఎదురవుతాయి.
