Memory : మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయం మెదడు. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం యాక్టివ్ గా పని చేస్తుంది. అయితే మెదడు చేసే ప్రధాన పని జ్ఞాపకశక్తిని ఉంచుకోవడం. జ్ఞాపకశక్తి ఉండడం వల్ల అన్ని పనులు సక్రమంగా సాగుతాయి. కానీ కొందరు ఒత్తిడి, ఇతర కారణాలవల్ల జ్ఞాపకశక్తిని కోల్పోతుంటారు. దీంతో అనుకున్న పనులను పూర్తి చేయలేరు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది జ్ఞాపకశక్తిని కోల్పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి రోజు చేసే పొరపాట్లే. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా ఉదయం లేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. ఆ తర్వాత ఏమీ తీసుకోకుండా మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతోనే ఉంటారు. అయితే ఈ గ్యాప్లో కచ్చితంగా టిఫిన్ చేయాలని ఆరోగ్యాన్ని పనులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఏదో ఒకటి తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుందని అంటున్నారు. దీంతో జ్ఞాపక శక్తిని కోల్పోయే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. అందువల్ల బ్రేక్ ఫాస్ట్ లో ఏదో ఒకటి తినాలని చెబుతున్నారు.
Also Read : మీ జ్ఞాపకశక్తిని మెరుగు పరుచుకోవాలి అనుకుంటున్నారా? ఈ మార్గాలు అనుసరించండి..
కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మెదడు నిరాశతో ఉండి జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. ప్రతిసారి తప్పు చేస్తున్నావని భావన కలిగి ఉండడంతో సరైన పనిని సక్రమంగా చేయలేరు. అందువల్ల చిన్నచిన్న పొరపాట్లు కూడా చేయకుండా ఉండాలి. అలా ఎప్పటికీ మెదడు కరెక్ట్ పనులు మాత్రమే చేయగలుగుతుంది అని అనుకోవాలి.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కటి టెక్నాలజీ మయం అయిపోయింది. ఇందులో భాగంగా దారులను వెతుక్కోవడానికి జిపిఎస్ లో ఎక్కువగా వాడుతున్నారు. అయితే ప్రతి దారి కోసం జిపిఎస్ లో వాడడం వల్ల మెదడు పనితీరు తగ్గిపోతుంది. దీంతో కొన్ని ముఖ్య విషయాలను గుర్తు పెట్టుకోవడానికి కూడా మెదడు పనిచేయదు. తద్వారా జ్ఞాపక శక్తిని కోల్పోతూ ఉంటారు. అందువల్ల జిపిఎస్ లో ఎక్కువగా వాడకుండా మెదడుతోనే ఆలోచన శక్తిని పెంచుకోవాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా వాడని వారు అంటూ లేరు. అయితే దీనివల్ల ఫోన్ స్క్రీన్ కళ్ళపై పడి తద్వారా మెదడుపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో మనసు ఆందోళనగా ఉండి జ్ఞాపకశక్తి కోల్పోతుంది. అయితే సాధ్యమైనంతవరకు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించి సొంతంగా పనిచేసుకునే అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా పదేపదే ఫోన్ను వాడడం మానుకోవాలి.
కొందరు తీపి వస్తువులు అంటే తెగ సంబరపడిపోతూ ఉంటారు. కానీ ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉన్న పదార్థాలు తినడం వల్ల కూడా జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశం ఉంది. షుగర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల మెదడులో వాపు ఏర్పడుతుంది. అలాగే అనేక రకాల సమస్యలతో జ్ఞాపకశక్తి కోల్పోతుంది. అందువల్ల షుగర్ తక్కువగా ఉండే పదార్థాలను మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కొందరు ఒకటికీ మించి పనులు చేయాలని అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఏ ఒక్క పనిపై ప్రత్యేక శ్రద్ధ ఉండదు. దీంతో మెదడు దేనిని గుర్తు పెట్టుకోకుండా నిరాశతో ఉంటుంది. క్రమంగా జ్ఞాపకశక్తి కూడా కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల మల్టీ టాస్కింగ్ కాకుండా ఏదో ఒకదానిపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల మెదడు యాక్టివ్ గా పని చేస్తుంది.
Also Read : ఎంత చదివినా గుర్తుండట్లేదా.. అయితే ఇలా చేయండి