Improve Memory : చాలా మంది కష్టపడి రోజంతా కూర్చుని చదువుతారు. కానీ అసలు గుర్తుండదు. చదివిన పది నిమిషాలకే మర్చిపోతుంటారు. ఎంత చదివినా ఇలా గుర్తు లేకపోతే కొందరు బట్టి పడుతుంటారు. చదివిన దాంట్లో చిన్న ముక్క మర్చిపోతే.. ఇంకా పరీక్షలు అసలు రాయలేరు. బట్టిగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం చదివితేనే గుర్తు ఉంటుంది. కొందరు అయితే పరీక్షలు ఉన్నాయని ఏదో చదువుతారు. ఏకాగ్రతతో చదివితేనే ప్రతి ఒక్కటి గుర్తు ఉంటుంది. పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. కొందరు పిల్లలకి పాటలు వింటూ చదివితే గుర్తుంటాయి. అయితే చదివేటప్పుడు కొన్ని పద్ధతులు పాటిస్తే తప్పకుండా చదివినవి గుర్తు ఉంటాయి. మరి ఆ పద్ధతులేంటో తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
తగినంత నిద్రపోవాలి
ఇంట్రెస్ట్ మీద చదవాలన్నా.. గుర్తుండాలన్నా కూడా సరైన నిద్ర బాడీకి ఉండాలి. అప్పుడే ఏం చదివినా కూడా మర్చిపోరు. రాత్రిళ్లు చదవాలని నిద్ర పాడుచేసుకోవద్దు. రాత్రి తొందరగానే నిద్రపోయి.. ఉదయం తొందరగా లేచి చదివితే తప్పకుండా గుర్తుంటుంది. వేకువ జామున చదివినవి అసలు మర్చిపోయే ప్రసక్తి లేదు.
సమయం ఎక్కువ కేటాయించాలి
ఎప్పటికి చదివింది గుర్తు ఉండాలంటే.. ఎక్కువ సమయం కేటాయించి చదవాలి. ఏదో తక్కువ సమయంలో చదివితే వస్తుందనుకుంటే కుదరదు. ఒకే విషయంపై ఎక్కువ సమయం ఏకాగ్రతతో చదివితే తప్పకుండా గుర్తు ఉంటుంది. కొందరు ఆటకి వెళ్లాలి, సినిమాకి వెళ్లాలని ఆ ధ్యాసలో చదువుతారు. దీనివల్ల చదివింది కూడా గుర్తు ఉండదు. కాబట్టి ఏకాగ్రతతో చదవడం అలవాటు చేసుకోండి.
టైమ్ టేబుల్ వేసుకోవాలి
ఎప్పుడు ఏ సబ్జెట్ చదవాలని ముందే ప్లాన్ చేసుకోవాలి. తప్పకుండా టైమ్ టేబుల్‌ను ఫాలో అవుతుండాలి. ఇలా సరైన సమయానికి ప్లానింగ్ ప్రకారం చదవడం వల్ల గుర్తుండటానికి అవకాశాలు ఉంటాయి. చదివేటప్పుడు ఎలాంటి ప్లానింగ్‌లు పెట్టుకోకుండా చదవాలి.
బయటకు చదవండి
కొందరికి మనసులో చదివితే బుర్రకి గుర్తు ఉంటుంది. కానీ బయటకు చదవడం వల్ల తొందరగా మర్చిపోరు. బయటకు వెళ్లిన పదాలు మళ్లీ మీ చెవులకి వినిపించడం వల్ల గుర్తుపెట్టుకుంటారు. కొందరు పాటలు పెట్టుకుంటూ, సినిమా చూసి కూడా చదువుతుంటారు. కానీ ఎవరికి ఎలా కంఫర్ట్ ఉంటే అలా చదవండి.
రాసుకుంటూ చదవాలి
ఏదైనా టాపిక్ చదివినప్పుడు పేపర్ మీద రాసుకుంటూ చదవాలి. ఇలా చదవడం వల్ల ఎప్పటికీ మర్చిపోరు. చదివిన ప్రతి టాపిక్‌ని ఇలా రాయడం వల్ల ఎన్ని రోజులు అయిన గుర్తు ఉంటుంది.
షార్ట్‌కట్స్‌లో గుర్తించుకోవాలి
చదివిన టాపిక్స్‌ను షార్ట్‌కట్స్‌లో గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఆ టాపిక్‌ను మీకు అర్థం అయ్యే విధంగా ప్రాక్టికల్‌గా ఊహించుకోవాలి. ఇలా ప్రాక్టికల్‌గా ఆలోచించడం వల్ల చదివింది ఎక్కువ రోజులు గుర్తు ఉంటుంది. మనం ప్రాక్టికల్‌గా ఏదైనా చూస్తే అసలు మర్చిపోం. ఎన్ని రోజులు అయిన కూడా ఆ టాపిక్ మన మైండ్‌లో అలా ఉండిపోతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: How to memory improve for studying
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com