LIC: ఎల్ఐసి అందిస్తున్న ఈ పథకాలలో మీరు రోజువారి, నెలవారి లేదా త్రైమాసిక ప్రాతిపదికన ప్రీమియం జమ చేసుకోవచ్చు. కొంత సమయం తర్వాత మీకు ఎల్ఐసి నుంచి మంచి మొత్తంలో డబ్బు లభిస్తుంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఎల్ఐసి జీవన్ ఆధార్ శిలా పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకంలో మీరు ప్రతిరోజు రూ.50 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా మొత్తంగా రూ.6 లక్షలు పొందొచ్చు. అయితే ఎల్ఐసి ఆధార్ శిలాపాలసి పథకం కేవలం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పథకంలో చేరిన మహిళలు చిన్న చిన్న మొత్తంలో పొదుపు చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో అధిక మొత్తాన్ని అందుకోవచ్చు. ఒకవేళ పాలసీదారుడు ఏదైనా కారణం చేత మరణించినట్లయితే అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకంలో చేరాలంటే కనీసం 8 ఏళ్ల వయసు నుంచి గరిష్టంగా 55 సంవత్సరాల వయసు వరకు ఉండాలి.
ఎల్ఐసి అందిస్తున్న ఆధార్ శిలా పథకంలో 10, 20 సంవత్సరాలు మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పథకంలో మీకు బీమా మొత్తం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు లభిస్తుంది. అలాగే మొదటి ప్రీమియం చెల్లించిన మూడేళ్ల తర్వాత మీరు పాలసీపై రుణం కూడా తీసుకునే అవకాశం ఉంది. 21 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక మహిళ 20 ఏళ్ల పాటు ఎల్ఐసి అందిస్తున్న జీవన్ ఆధార్ శిలా పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే ఆమెకు వార్షిక ప్రీమియం రూ.18976 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం 20 సంవత్సరాలలో రూ.3,80,000 వేలు అవుతుంది. ఇక మెచ్యూరిటీ సమయంలో మీకు రూ.6,62,000 చేతికి అందుతాయి.
అలాగే ఈ పథకంలో ఐదు లక్షల ప్రాథమిక బీమా కవర్ రూ. వన్ పాయింట్ సిక్స్ టూ లక్షల లాయల్టీ అడిషన్ కూడా ఉంటుంది. ఒకవేళ ఎనిమిదేళ్ల వయసు ఉన్న బాలిక ఈ ప్లాన్ తీసుకున్నట్లయితే ఈ గణన వర్తించదు. ఎందుకంటే ఆ సమయంలో ప్రీమియం మొత్తం తగ్గుతుంది. ఒకవేళ మీరు ఎల్ఐసి అందిస్తున్న ఆధార్ శిలా పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒకసారి మీరు మీకు దగ్గరలో ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని సందర్శించడం మంచిది. ఆ కార్యాలయంలో మీరు ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ పథకంలో చేరే పాలసీదారు కోరుకుంటే ప్రతి ఏడాది వాయిదాలలో మెచ్యూరిటీ డబ్బును కూడా తీసుకునే అవకాశం ఉంది.