Wife and Husband: కాపురం చేసే కల కాలు తొక్కేనాడే తెలుస్తుంది అంటారు. భార్యాభర్తల మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి పురాణాలు, ఇతిహాసాలు కూడా మనకు చెబుతున్నాయి. రామాయణ కాలం నుంచి నేటి కాలం వరకు కూడా భార్యాభర్తల బంధం గురించి రకరకాల కథలు ప్రచారం ఉన్నాయి. గతంలో భార్యలు భర్తలను ఏమండీ అంటూ ప్రేమగా పిలిచేవారు. ముద్దుగా ఏమయ్యా అంటూ సంబోధించేవారు.
కాలక్రమేణా వారిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం భర్తలను బావ, జీ, హాజీ అంటూ రకరకాలుగా పిలుస్తూ వారిలోనే ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. సంప్రదాయాలను పాటిస్తూ భర్తలను పేరు పెట్టి పిలుస్తున్నారు. నలుగురిలో భర్తల విలువను రెట్టింపు చేసేందుకు పాశ్చాత్య సంస్కృతిలో డార్లింగ్ అంటున్నారు.
Also Read: పెళ్లయిన తొలినాళ్లలో ఎలా ఉండాలంటే..?
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యల పట్ల భర్తలు కూడా ప్రేమగా ఏంట్రా, బుజ్జి, డార్లింగ్ అంటూ ప్రేమగా పిలుస్తూ వారి మనసు దోచుకుంటున్నారు. ఇంట్లో వాళ్ల ముందు, పిల్లల ఎదుట మాత్రం భర్తలను పేరు పెట్టి పిలవకూడదని చూస్తుంటారు. భర్త గౌరవం తగ్గకుండా చేసే క్రమంలో భార్యలు భర్తలను ప్రేమగా చూసుకుంటున్నారు. భర్తల ప్రతిష్టను ఇనుమడింపజేసే క్రమంలో వారికి అగ్రతాంబూలం ఇస్తున్నారు.
భార్యాభర్తల సంబంధాలపై పాశ్చాత్య దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. విదేశీయులు సైతం భారతీయ సంప్రదాయాలపై మక్కువ చూపిస్తూ మన సంబంధాల గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరైతే మన ఆచార వ్యవహారాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ మన వారి అలవాట్లను ఆచరిస్తున్నారు. ఇందులో భాగంగానే భార్యాభర్తల బంధం పెరుగుతోంది.
Also Read: ప్రతీ ఆడపిల్లకు ఈ పెళ్లికూతురు ఆదర్శం..ఏం చేసిందో చూడండి..