https://oktelugu.com/

Lakshya Movie: నాగ శౌర్య ” లక్ష్య ” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే ?

Lakshya Movie: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్న నటుల్లో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఒకరు. కెరీర్ పరంగా శౌర్య ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ హీరో ప్రస్తుతం ‘లక్ష్య’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది నాగ శౌర్యకు 20వ చిత్రం కావడం విశేషం. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 26, 2021 / 04:36 PM IST
    Follow us on

    Lakshya Movie: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్న నటుల్లో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఒకరు. కెరీర్ పరంగా శౌర్య ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ హీరో ప్రస్తుతం ‘లక్ష్య’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది నాగ శౌర్యకు 20వ చిత్రం కావడం విశేషం. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌ ఇటీవల విడుదల చేశారు. సోనాలి నారంగ్‌ సమర్పించగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ శరత్ మరార్‌, నారయణ దాస్‌ కె, నారంగ్‌, పుస్కుర్‌ రామ్ మోహన్ రావు,నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్స్‌ కలిసి నిర‍్మిస్తున‍్నాయి. ఈ సినిమాలో నటుడు జగపతిబాబు కీలక పాత‍్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ చేస్తున్నారు.

    ఈ పోస్టర్‌లో దృఢమైన శరీరాకృతితో పోనీ టేల్‌తో వర్షంలో విల్లు పట్టుకుని స్టైల్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఆర్చరీ నేపథ్యంలో రానుండగా… పార్థు అనే క్రీడకారుడి పాత్రలో నటిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమా కోసం నాగశౌర్య భారీగా వర్క్‌అవుట్స్‌ చేసి శరీరాన్ని దృఢంగా తయారు చేసుకున్నాడు. అలానే ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించగా… రామ్‌ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. ఇటీవలే నాగశౌర్య ‘వరుడు కావలెను’ అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులను లక్ష్య సినిమా పూర్తి చేసుకుంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు చిత్రబృందం భారీ ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తోంది.