https://oktelugu.com/

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నుంచి జనని సాంగ్ విడుదల… గుండెలు పిండేసిన జక్కన్న

RRR Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 26, 2021 / 04:10 PM IST
    Follow us on

    RRR Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి జనని అనే పాటను విడుదల చేశారు.

    ఈ పాటలో సినిమా ఆత్మను చూపించారు జక్కన్న. అద్భుతమైన విజువల్స్ తో సాగిన ఈ పాటలో హీరోలు పోరాటం చేయడం చూపించారు. అజయ్ దేవగన్, తారక్, చరణ్, శ్రియ, అలియా భట్ పై ఈ పాటను కట్ చేశారు. బ్రిటీష్ పాలకులు మనపై చేసిన దాడులను చూపించారు. హీరోలు పోరాటం చేయడానికి ఎందుకు కంకణం కట్టుకున్నారు.. వారి కళ్ళముందు ఎలాంటి దాడులు జరిగాయి. అమాయకుల ప్రాణాలు పోవడం ఇలా అన్ని ఈ పాటలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ పాటకు కీరవాణి తన సంగీతంతో… ప్రాణం పోశారని చెప్పాలి.

    అలాగే ఈ పాట లిరిక్స్ కూడా కీరవాణినే రాయడం విశేషం. కాగా, డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించనున్నారు. కాగా వీరి సరసన ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్ హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.