Viral Photo: స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో సోషల్ మీడియా వినియోగం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతోంది. దేశంలోని యువత, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ప్రపంచంలో ఏ చిన్న వింత ఘటన చోటు చేసుకున్నా సెకన్ల వ్యవధిలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్నో ఫోటో ఫజిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో కొన్నింటిని సులభంగా కనిపెట్టడం సాధ్యమవుతుంటే మరికొన్ని కనిపెట్టే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కొన్ని ఫోటో ఫజిల్స్ తీక్షణంగా చూస్తున్నా చాలామంది కనిపెట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. ఫోటో ఫజిల్స్ లో ఉండే జంతువులు, వస్తువులను కనిపెట్టే విషయంలో కొన్నిసార్లు అంచనాలు నిజమవుతున్నా చాలాసార్లు అంచనాలు ఫెయిల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో ఫజిల్ వైరల్ అవుతుండగా ఈ ఫోటో ఫజిల్ లో మనకు బాగా పరిచయం ఉన్న ఒక జంతువు కూడా ఉంది.
దూరం నుంచి ఫోటోను చూసిన సమయంలో ఆ ఫోటోలో ఏదో చెట్టు బెరడు ఉందని మనకు అనిపిస్తుంది. చూడటానికి ఆ జంతువు మొసలి ఆకారంలో ఉన్నప్పటికీ అది మొసలి కూడా కాదు. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రం ఆ ఫోటోలో ఒక పురుగు ఉందని అర్థమవుతుంది. ఎంతో తీక్షణంగా చూస్తే మాత్రమే అక్కడ ఉన్న పురుగును గుర్తించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
Find The Animal In This Picture..@TheViralFever @the_viralvideos @WhatsTrending #Trending #ViralVideo pic.twitter.com/h9eABpG5X6
— telugufunworld (@telugufunworld) December 25, 2021
ఒకవేళ ఎంత కష్టపడినా ఆ పురుగును కనిపెట్టలేకపోతే మాత్రం కింది ఫోటోను చూడటం ద్వారా ఆ పురుగును కనిపెట్టవచ్చు. పురుగు రంగు కూడా ఫోటోలోని గడ్డి రంగును పోలి ఉండటంతో పురుగును కనిపెట్టే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.