https://oktelugu.com/

Lip lock : లిప్ లాక్ పెట్టుకుంటే.. ముద్దు వ్యాధి వస్తుందా?

ఇలా పెట్టుకోవడం వల్ల వాళ్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ వల్ల వ్యాధులు వస్తాయి. ఇలాంటి వ్యాధులకు నివారణ ముద్దుకు దూరంగా ఉండటమే. వచ్చిన తరువాత దేనిని తగ్గించడం చాలా కష్టం. కాబట్టి రాకుండా ముందు జాగ్రత్తగా ఉండాలంటే.. ముద్దుకి దూరంగా ఉండటం బెటర్.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 5, 2024 / 09:56 PM IST

    Does lip lock cause Kissing disease

    Follow us on

    Kissing : ఈరోజుల్లో అందరికీ లిప్ లాక్ గురించి తెలిసిందే. మారిన జీవన శైలి లేదా సినిమాల ప్రభావం వల్ల స్కూల్ పిల్లలకి కూడా లిప్ లాక్ అంటే తెలుసు. భాగస్వామి మీద ప్రేమని వ్యక్తపరచడానికి ఎక్కువగా ముద్దు పెడుతుంటారు. ముద్దు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన పోతాయని చాలామంది అంటుంటారు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. భాగ్య స్వామిని ఒక ముద్దు పెట్టుకుంటే మొత్తం అన్ని ఒక్కసారి పోతాయి. ఇంకా బాడీకి ఎనర్జీ కూడా వస్తుందని అంటుంటారు. ముద్దు పెట్టుకున్న తరువాత మంచి ఎనర్జీ ఫీల్ కూడా వస్తుంది. అయితే ముద్దు వల్ల కేవలం లాభాలు మాత్రమే కాకుండా.. నష్టాలు కూడా ఉన్నాయి. ముద్దు పెట్టుకున్నప్పుడు బ్యాక్టీరియా చేరుతుంది. దీనివల్ల ముద్దు వ్యాధి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ముద్దు వ్యాధి అంటే ఏంటి? దీని వల్ల కలిగే హాని ఏంటో మరి తెలుసుకుందాం.

    ఒకరికి ఒకరు లిప్ లాక్ పెట్టుకోవడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా, వైరస్ వ్యాపిస్తుంది. ఏ వైరస్ లాలాజలం నుంచి వేరే వాళ్లకు వ్యాపిస్తుంది. దీనినే మోనోన్యూక్లియోసిస్ లేదా ముద్దు వ్యాధి అని కూడా అంటారు. ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. ఇది వైరస్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అయితే ఈ వ్యాధి ఎక్కువగా 15 నుంచి 24 సంవత్సరాల వాళ్లలో కనిపిస్తుంది. ఈ వైరస్ ఉన్న వ్యక్తిని ముద్దు పెట్టుకున్న, వాళ్ల వస్తువులను తాకినా ఈ వ్యాధి వస్తుంది. మోనోన్యూక్లియోసిస్అనేది ఒక అంటూ వ్యాధి. ఈ వ్యాధి సోకిన వాళ్లలో ఎక్కువగా కండరాల నొప్పి ఉంటుంది. బాడీలోకి బాక్టీరియా వ్యాప్తి చెందితే.. కీళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, తల నొప్పి, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మోనోన్యూక్లియోసిస్ ఉన్న వాళ్లకి ఎక్కువగా తలనొప్పి, అలసట తప్పకుండా ఉంటుంది. అయితే వీటిలో ఏ చిన్న లక్షణం కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

    మోనోన్యూక్లియోసిస్ వ్యాధి వచ్చిన వాళ్లకి నెల రోజులకి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి వెంటనే కనిపిస్తాయి. పెద్ద ఈ మోనో బ్యాక్టీరియా వల్ల బాడీలో చాలా అలసటగా ఉంటుంది. ఎంత విశ్రాంతి తీసుకున్న కూడా శరీరానికి అసలు నీరసంగానే అనిపిస్తుంది. అలాగే కొందరిలో తీవ్రంగా గొంతు నొప్పి ఉండి.. చిన్నగా చీము ఏర్పడుతుంది. ఏ చిన్న లక్షణం కనిపించిన లైట్ తీసుకోకుండా డాక్టర్ ను సంప్రదించాలి. కాబట్టి ఎక్కువగా ముద్దులు పెట్టుకోవద్దు. ఇలా పెట్టుకోవడం వల్ల వాళ్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ వల్ల వ్యాధులు వస్తాయి. ఇలాంటి వ్యాధులకు నివారణ ముద్దుకు దూరంగా ఉండటమే. వచ్చిన తరువాత దేనిని తగ్గించడం చాలా కష్టం. కాబట్టి రాకుండా ముందు జాగ్రత్తగా ఉండాలంటే.. ముద్దుకి దూరంగా ఉండటం బెటర్.