సోషల్ మీడియాలో తన గ్లామర్ తో కుర్రకారు మతిపోగొడుతున్న హీరోయిన్ లలో యుక్తి తరేజా ఒకరు.
2019లోనే మోడలింగ్ స్టార్ట్ చేసింది ఈ అమ్మడు. ఎంట్రీ ఇచ్చిందే ఆలస్యం ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్లో నాల్గవ స్థానంలో నిలిచింది.
ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఏకంగా తెలుగులో హీరో నాగశౌర్య సరసన నటించే ఛాన్స్ వచ్చింది.
మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల ఫేవరేట్ అవుతుందనుకున్నారు. కానీ ఈ సినిమా పెద్దగా కలిసి రాలేదు.
యుక్తి తరేజా..నాగశౌర్య నటించిన రంగబలి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది . కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు.
మొదటి సినిమానే నెగటివ్ రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడం లేదు. అయితే సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఆఫర్స్ కోసం ట్రై చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
నెట్టింట గ్లామర్ ఫోటోలకు ఫోజులిస్తూ మైండ్ బ్లాంక్ చేయడంలో ఏ మాత్రం తగ్గదు ఈ బ్యూటీ.
హర్యానా సమీపంలోని కైతల్ ప్రాంతంలో పర్వీన్ తరేజా, రీటా తరేజా దంపతులకు 2000వ సంవత్సరంలో పుట్టింది.