Listening Songs : పాటలు అంటే ఇష్టంలేని వాళ్లు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ వాళ్లకి నచ్చిన పాటలని ఏదో ఒక సమయంలో వింటూనే ఉంటారు. మనసు బాగులేకపోయిన, కొంచెం డల్ గా ఉన్న కూడా పాటలు వినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొందరు అయితే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు పాటలు వింటూనే ఉంటారు. పాటలు మనస్సుకు ఎంతో రిలాక్స్ ని ఇస్తాయి. జర్నీ చేసిన, కాలేజీకి బయలుదేరిన, ఇలా ఎక్కడికి వెళ్లిన ముందు.. ఇయర్ ఫోన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటారు. పాటలు వింటూ అలా ఎంత దూరం అయిన కూడా ప్రయాణం చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా పాటలు వింటుంటారు. మనకి నచ్చిన పాట ఏదయినా ఒకటి వింటే.. ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఒక్కసారిగా టెన్షన్ అంత మర్చిపోతాం. కొందరు అయితే వర్క్ చేస్తూ, చదువుతూ కూడా పాటలు వింటారు. అయితే పాటలు వినడం వల్ల కేవలం మనసు ప్రశాంతంగా ఉండటం మాత్రమే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
రోజూ సంగీతం వినడం వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. అలాగే దృష్టి పెరిగేలా కూడా చేస్తుంది. రోజూ పాటలు వింటుంటే.. జ్ఞాపకశక్తి తొందరగా పెరుగుతుంది. నిద్రపోయే ముందు పాటలు విని పడుకుంటే బాగా నిద్రపడుతుంది.నిద్రలేమి సమస్య ఉన్నవాళ్లకి సంగీతం బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుండెకి రక్తం సరఫరా అయ్యేలా చేయడంతో పాటు.. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. అలాగే రక్తంలో సెరటోనీన్ స్థాయిలను పెంచుతుంది. రోజూ పాటలు వినడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, మానసిక వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. సంగీతం వల్ల మతిమరుపు కూడా తగ్గుతుంది.
ఇదే కాకుండా.. కొందరు బరువు తగ్గడానికి కూడా సాయపడుతుంది. పాటలు వింటూ ఏదయినా పని చేస్తే.. చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కొందరికి వ్యాయామం చేయడానికి అంత ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్లు సంగీతం వింటూ.. వ్యాయామం చేస్తే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలు, వర్క్ లైఫ్ వల్ల చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. రోజూ పాటలు వినడం వల్ల ఆందోళన తగ్గుతుంది. శరీరంలో ఒత్తిడి హార్మోన్లు తక్కువగా విడుదల చేసేలా చేస్తుంది. కొందరు దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడుతుంటారు. ఇలాంటి వాళ్లకి మ్యూజిక్ బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి చదువు లేదా ఇంకా దేని మీద శ్రద్ధ లేకపోయిన.. అలాంటి పిల్లలు పాటలు వింటే శ్రద్ధ పెరుగుతుంది. పాటలు వింటూ గుర్తుపెట్టుకుంటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దేనిని అయిన గుర్తుపెట్టుకోగలరు. కాబట్టి రోజులో ఏదో ఒక సమయంలో పాటలు వినడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మానసిక సమస్యలు తగ్గి.. సంతోషంగా ఉంటారు.