https://oktelugu.com/

full work : ఫుల్ వర్క్ లో ఉన్నప్పుడు నిద్ర డిస్టర్బ్ చేస్తుందా?

ఫుల్ గా పని ఉన్నప్పుడు, అర్జెంట్ వర్క్ లో ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఎవరితో అయినా మీటింగ్ లో ఉన్నప్పుడు నిద్ర వస్తే ఎంత చిరాకుగా ఉంటుందో కదా! మరి ఈ సమస్య నుంచి మీరు బయటపడాలి అనుకుంటున్నారా?

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 6, 2024 / 07:52 AM IST

    full work

    Follow us on

    full work : ఫుల్ గా పని ఉన్నప్పుడు, అర్జెంట్ వర్క్ లో ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఎవరితో అయినా మీటింగ్ లో ఉన్నప్పుడు నిద్ర వస్తే ఎంత చిరాకుగా ఉంటుందో కదా! మరి ఈ సమస్య నుంచి మీరు బయటపడాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్లికల్ మీకోసమే. మధ్యాహ్నం వేళల్లో పని(Work) చేస్తున్నప్పుడో, సీరియస్‌గా పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నప్పుడు కూడా మీలో చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు. కొందరికి భోజనం తర్వాత శరీరం పనిచేసేందుకు ఏమాత్రం ఒప్పుకోదు. దీంతో ఏ పని చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఆ పని మీద దృష్టి పెట్టలేం. ఇది చాలా మందిలో మామూలుగా ఉండే సమస్యేనే కానీ, రోజంతా ఇలాగే ఉంటే వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ చేయడం చాలా కష్టం. అందువల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టాలి అనుకుంటే ఈ నిపుణులు టిప్స్ పాటించండి.

    డిన్నర్‌: రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయవద్దు. దీని వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే భోజనం తర్వాత అంటే 3 నుంచి 4 గంటల తర్వాత మీరు నిద్ర పోవడం బెస్ట్. వీలైనంత తొందరగా రాత్రి భోజనం ఫినీష్ చేసుకోవాలి. ఏ ఆహారం అయినా సరే.. లేట్‌ నైట్స్‌ తినకుండా త్వరగా భోజనం చేసుకోవడం అలవాటు చేసుకోండి. దీని వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

    స్క్రీన్‌ టైమ్‌: చాలా మంది ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ పరికరాలతో జీవితం గడిపేస్తున్నారు. మనిషి జీవితానికి ఈ పరికరాలకు వీడదీయరాని అనుబంధం ఏర్పడినట్టుగా మారింది. ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడుపుతున్నారు. అవసరానికి మించి స్క్రీన్‌లకు అతుక్కుపోతున్నారు. తక్కువ వెలుతురులో ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది అంటున్నారు నిపుణులు. ఈ ఎలక్ట్రానిక్ పరికరకాల ఉపయోగం మీ భోజనానికి ముందే ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత మీరు కాస్త వీటికి దూరంగా ఉండటమే బెటర్.

    నిద్రలో రెగ్యులారిటీ: మంచి నిద్ర కావాలి అనుకుంటున్నారా? అయితే చుట్టూ ఉండే వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. పడుకునే ముందు గదిలోకి ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోండి. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది. మరో ముఖ్యమైన విషయం కచ్చితంగా 6 నుంచి 8 గంటల నిద్ర పోవడం అవసరం. చిరాకు, అలసట, నీరసం వంటివి దరి చేరవు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

    రాత్రి వేళల్లో టీ, కాఫీలకు దూరం: కాఫీ, టీల్లో ఉండే కెఫిన్‌ నిద్రను దూరం చేస్తుంది అంటున్నారు నిపుణులు. రాత్రి సమయంలో వీటిని తాగడం వల్ల నిద్ర రాదు. భోజనం తర్వాత కాఫీ, టీలు తాగకూడదు. రాత్రి పడుకునే ముందు పుస్తకం చదవటం అలవాటు చేసుకోండి.

    ఆల్కహాల్‌కు దూరం: ఆల్కహాల్‌ తాగితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేమి శరీర ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది అంటున్నారు నిపుణులు. దీంతో ఏ పనిని పూర్తిగా చేయలేరు కాబట్టి ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక పసుపు కలిపిన పాలను నిద్రపోయే ముందు తాగండి. దీని వల్ల మీకు హాయిగా నిద్రపడుతుంది. సో మధ్యాహ్నం మీకు నిద్ర రాదు.