kids : చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని అతి జాగ్రత్తలు తీసుకుంటారు. జాగ్రత్తలు తీసుకోవడం ఒకే. కానీ అతి జాగ్రత్తల వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. అనవసరమైన జాగ్రత్తలు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందుకే మీరు జాగ్రత్తలు తీసుకునేటప్పుడు వారికి అది అవసరమా? లేదా అనే విషయాన్ని కచ్చితంగా ఆలోచించండి. కొందరు ఎక్కువగా డైపర్లు వేస్తుంటారు. అయితే డైపర్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇక ఇది ఇలా ఉంటే పిల్లలు నడుస్తుంటే వారి కాలు కంది పోతుందేమో అనే భయంతో సాక్సులు, చెప్పులు వేస్తుంటారు. ఇది ఒకే. కానీ ఆ సాక్సులను, చెప్పులను ఎంత వరకు క్లీన్ గా ఉంచుతున్నారు? మీ ఉపయోగం వల్ల వారికి నష్టం కలుగుతుందా? లేదా ఆరోగ్యమా అనే విషయాన్ని కచ్చితంగా తల్లిదండ్రులు గమనించాలి. చాలా మంది తల్లిదండ్రులు చెప్పుల్లేకుండా పిల్లలను కాలు బయటపెట్టనివ్వరు. పాదాలకు మట్టి అంట వద్దని వారి లేలేత పాదాలను కందిపోకుండా చూసుకుంటారు. అందుకే సాక్సులు, షూలు ఎక్కువగా తొడుగుతుంటారు. అందుకే ఈ అతి జాగ్రత్త అన్ని సందర్భాల్లో పనికి రాదు అంటున్నారు నిపుణులు.
పిల్లలు స్కూల్ కు వెళ్ళేటప్పుడు షూ, సాక్సులు వేసుకోవడం కామన్. అయితే కొందరు మాత్రం సాక్సులు మార్చకుండా వాటినే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి అజాగ్రత్తల వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందటానికి అనువైన వాతావరణం ఏర్పడుతుందట. దీంతో పాదాలకు ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని బారిన పడితే పూర్తిగా నిర్మూలించడం కూడా కష్టమే. నెలల తరబడి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్త మస్ట్. మరీ ముఖ్యంగా పిల్లలకు కాటన్ సాక్సులను మాత్రమే వేయాలి. వీటిని ప్రతి రోజు మారుస్తూ, శుభ్రం చేస్తూ ఉండాలి. పూర్తిగా ఎండిన తర్వాతనే వారికి వేయాలి. అందుకే ముందుగానే రెండు మూడు జతలు కొనుగోలు చేసి పెట్టడం మంచిది.
ఖాళీ నడక మంచిది: చిన్నారులు చెప్పుల్లేకుండా వట్టి కాళ్ళతో నేలపై, పచ్చటి గడ్డిపై నడవాలి అంటున్నారు నిపుణులు. దీని వల్ల ఆరోగ్యపరంగా, మానసికంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక చిన్న వయసులో చెప్పులతో తిరిగిన పిల్లలతో పోల్చితే చెప్పుల్లేకుండా నేలపై తిరిగిన చిన్నారుల్లో అనేక మెరుగైన ఫలితాలు ఉంటాయట. ఈ విషయాలు పరిశోధనలు వెల్లడయ్యాయి. ఇలా చెప్పులు లేకుండా నడవడం వల్ల మెదడు ఎక్కువ చురుకు అవుతుంది. The Benefits of Barefoot Walking for Children అనే అధ్యయనం చేయగా అందులో ఈ విషయం వెల్లడైంది.