Mega Hero: ఒక సినిమాకు స్టార్ హీరో డేట్స్ దొరకడం చాలా కష్టం. అదీ మెగా క్యాంప్ కు చెందిన హీరో అయితే మరీ కష్టం. అలాంటి వారి కాల్ సీట్ల ఆధారంగానే సినిమా నిర్మించుకోవాలని కొందరు అంటుంటారు. అయితే ఓ చిన్న నిర్మాత కూడా అలాంటి హీరోతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో డేట్స్ దొరకగానే వెంటనే అడ్వాన్స్ ఇచ్చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. ఇప్పుడు సినిమా లేనందన అడ్వాన్స్ ఇవ్వాలని సదరు చిన్న నిర్మాత హీరోను అడిగాడట. అయితే ఆ హీరో ససేమిరా అంటున్నాడు. అంతేకాకుండా నీ వల్ల నాకు ఇంకో సినిమా ఛాన్స్ పోయిందంటూ దబాయిస్తున్నాడట. అసలేం జరిగిందంటే..?

మెగా కాంపౌండ్ నుంచి హీరో సినిమా అంటే ఫ్యాన్స్ లో క్రేజీ ఉంటుంది. దీంతో కొందరు నిర్మాతలు ఆ హీరోలతో సినిమా తీయాలని ఆరాటపడుతుంటారు. ఇందులో భాగంగా ఓ నిర్మాత మెగా క్యాంప్ కు చెందిన ఓ హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడు. అంతేకాకుండా ఓ నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా హీరోకు రూ.25 లక్షలు, నిర్మాణ సంస్థకు రూ.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
డబ్బులు తీసుకున్న హీరో, నిర్మాణ సంస్థ మధ్య వివాదం మొదలైంది. సదరు హీరో తనకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కావాలని, ఫలానా సినిమాటోగ్రాఫర్ కావాలని డిమాండ్ చేశాడట. అలా అయితేనే సినిమా చేస్తానని అన్నాడట. అయితే అది కుదరదని నిర్మాణ సంస్థ హీరోకు బదులిచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. అసలే మెగా హీరో.. ఎందుకీ గొడవ అనుకొని నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో సినిమా ఆగిపోయింది.

అయిందేదో అయింది.. అనుకొని ఆ నిర్మాత తన డబ్బు తనకు ఇవ్వాలని హీరో దగ్గరికి వచ్చాడు. కానీ హీరో మాత్రం తనకు ఇచ్చిన అడ్వాన్స్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కు ఓకే చెప్పడం వల్ల మరో సినిమా మిస్సయిందని అంటున్నాడట. దీంతో ఆ నిర్మాత లబోదిబోమంటున్నారు. నిర్మాణ సంస్థ, హీరోకు మధ్య ఏర్పడిన వివాదం తో మధ్యలో నిర్మాతకు రూ.35 లక్షలు నష్టం వచ్చింది. మరి ఆ నిర్మాత ఏం చేస్తాడో చూడాలి.