Life Style: దు:ఖం, సంతోషం, బాధ, ఆనందం ఎప్పుడు వస్తుంటాయి. వెళ్తుంటాయి. మంచి జరిగినప్పుడు ఆనందం, చెడు జరిగినప్పుడు దు:ఖం కామన్. కానీ కొన్ని సార్లు ఈ ఎమోషన్ లను కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అయితే దు:ఖంలో, సంతోషంలో మాట ఇస్తుంటారు కొందరు. మరి ఇలాంటి సమయంలో మాట ఇవ్వవచ్చా? లేదా? దీని వల్ల ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకుంటాయి అనే వివరాలు చూసేద్దామా?
ఆనందంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మాట ఇవ్వద్దు అంటారు పెద్దలు. ఎందుకంటే మనుషులు సంతోషంగా, ఆనందంగా ఉన్న సమయంలో వాదించే గుణాన్ని, ఆలోచించే గుణాన్ని నశింపజేస్తుంది. అందుకే ఇలాంటి సమయంలో మాట ఇస్తే ఆ తర్వాత అదే మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. దీనివల్ల బంధాలు కూడా దూరం అయ్యే అవకాశం లేకపోలేదు. ఒకవేళ మీరు ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇస్తే ఆ తర్వాత మీరు ఆ పని చేయకపోవచ్చు. అలాంటప్పుడు ఎదుటి వ్యక్తి మనసులో మీపై చెడు అభిప్రాయం ఏర్పడవచ్చు.
కోపంలో కూడా సమాధానం ఇవ్వద్దు అంటారు పెద్దలు. ఎందుకంటే కోపంలో ఉంటే మీ వివేకాన్ని కోల్పోతారు. ఈ సమయంలో మీరు అసలు ఆలోచించి సమాధానాలు ఇవ్వరు. అందుకే కోపంలో ఇచ్చే సమాధానం వల్ల ఎదుటి వారి మనసు చాలా నొచ్చుకోవచ్చు. మీ రిలేషన్ దెబ్బతినవచ్చు. ఈ ఒక్క మాట వల్ల మీ రిలేషన్ దెబ్బతింటుంది కాబట్టి మీరు కాస్త ఆలోచించి మాట్లాడాలి. కోపంతో మాట్లాడితే అపార్థం చేసుకుంటారు ఇతరులు. ఒక్క మాట ఎన్నో అనర్థాలను తెచ్చిపెడుతుంది. అందుకే ఆలోచించి మాట్లాడాలి.
కోపంలో సమాధానం ఇవ్వడం, ఆనందంలో మాట ఇవ్వడం రెండూ కూడా మిమ్మల్ని ఇబ్బందిని తెచ్చిపెడుతుంటాయి.అందుకే కాస్త జాగ్రత్త. ఎలాంటి సమయంలో అయినా మీరు మీ నోటిని జాగ్రత్తగా ఉంచుకోవడమే బెటర్. లేదంటే మీరే చాలా అనర్థాలను అనుభవించాల్సి ఉంటుంది అని గుర్తు పెట్టుకోండి.