https://oktelugu.com/

Fridge: ఫ్రిజ్ ను గోడకు ఆనుకొని పెడుతున్నారా? అయితే ఇది మీ కోసమే..

మీ వినియోగం వల్ల మీ విద్యుత్ బిల్లు కూడా చాలా ఎక్కవ వస్తుంటుంది. మీ రిఫ్రిజిరేటర్ గోడ మధ్య కొంత ఖాళీని ఉంచడం చాలా ముఖ్యం. దీని ద్వారా వల్ల రిఫ్రిజిరేటర్ మెరుగ్గా నడుస్తుంది. స్థలం చాలా తక్కువగా ఉంటే, రిఫ్రిజిరేటర్ చల్లబరచడానికి చాలా ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 26, 2024 / 11:09 AM IST

    Fridge

    Follow us on

    Fridge: ఒకప్పుడు ఫ్రిజ్ కూలర్ వంటివి ఎక్కువ వాడే వారు కాదు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి ఉంటున్నాయి. ఇక కూరగాయలు పాడు అవుతాయి అని లేదా పదార్థాలు, వంటకాలు నిల్వ ఉండాలి అని అందరి ఇంట్లో ఫ్రిజ్ కనిపిస్తుంది. ఇక ఏ ఎలక్ట్రానిక్ వస్తువునైనా సరే జాగ్రత్తగా చూసుకోకపోతే ఎక్కువ కాలం పనిచేయదు. కాబట్టి ఫ్రిజ్‌కు ఆయుష్షు పెరగాలంటే వాటిపై కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. చిన్న చిన్న విషయాలను పట్టించుకోక పోతే .. ఫ్రిజ్‌ను సరిగ్గా నిర్వహించకపోతే.. అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది.

    మీ వినియోగం వల్ల మీ విద్యుత్ బిల్లు కూడా చాలా ఎక్కవ వస్తుంటుంది. మీ రిఫ్రిజిరేటర్ గోడ మధ్య కొంత ఖాళీని ఉంచడం చాలా ముఖ్యం. దీని ద్వారా వల్ల రిఫ్రిజిరేటర్ మెరుగ్గా నడుస్తుంది. స్థలం చాలా తక్కువగా ఉంటే, రిఫ్రిజిరేటర్ చల్లబరచడానికి చాలా ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. దీని వల్ల విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తుందట. ఇక గాలి ప్రసరణ కోసం రిఫ్రిజిరేటర్ గోడ నుంచి తగినంత దూరంలో ఉంచడం మరీ ముఖ్యం.

    ఏదైనా యంత్రం సజావుగా నడపడానికి, అధికంగా హీట్ కాకుండా ఉంచాలి అంటే యంత్రం చుట్టూ కొంత స్థలం ఉంచాలి అంటున్నారు నిపుణులు. స్థలాన్ని ఆదా చేయడానికి మీ ఫ్రిజ్‌ని ఓవర్‌లోడ్ చేయకండి. దానికి కావాల్సినంత ప్లేస్ లేకపోతే కంప్రెసర్ వేడెక్కుతుంది. దీని వల్ల రిఫ్రిజిరేటర్ పాడయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఫ్రిజ్‌ను గోడకు దూరంగా ఉంచడం అవసరం.