https://oktelugu.com/

Pooja Room Tips: పూజ గదిలో ఎక్కువగా అగర్బత్తులు వెలిగిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

అగరబత్తీలు అందరి జీవితంలో ఒక భాగం. వీటి నుంచి వచ్చే పరిమళమైన సువాసన మనలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. అంతేకాదు మనం ఉంటున్న ప్రదేశంలో మంచి జరిగేలా ప్రేరేపిస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 9, 2024 11:25 am
    Pooja Room Tips

    Pooja Room Tips

    Follow us on

    Pooja Room Tips: పూజ చేయాలంటే కచ్చితంగా ధూప దీప నైవేద్యం పెట్టాల్సిందే. ఇవి లేకుండా ఏ ఇంట్లో కూడా పూజ పూర్తి అవదు. ఈ పూజా కార్యక్రమంలో అగర్బత్తీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. దీనికోసం ప్రతి ఇంట్లో వీటి పొగను పీలుస్తుంటారు. అయితే ఇవే కాదు దోమల కోసం కూడా అగర్బత్తీలు వాడుతున్నారు. మరి ఇంతకీ ఈ అగర్బత్తీలు వాడడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసా? వీటి వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో తెలుసుకోండి..

    అగరబత్తీలు అందరి జీవితంలో ఒక భాగం. వీటి నుంచి వచ్చే పరిమళమైన సువాసన మనలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. అంతేకాదు మనం ఉంటున్న ప్రదేశంలో మంచి జరిగేలా ప్రేరేపిస్తుంది. ఇదంతా వింటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. కానీ వీటి వల్ల చెడు జరుగుతుంది అనేది కూడా అంతే నిజం అంటున్నారు కొందరు. అగర్బత్తుల వల్ల సమస్య రాదు కానీ వాటి నుంచి వచ్చే పొగ వల్ల సమస్య వస్తుందట. అయితే ప్రపంచం ఇప్పటికే పొగతో నిండిపోయి ఉంది. స్వచ్ఛమైన గాలి కరువైంది, కాలుష్యం ఎక్కువైపోయింది. మన పూర్వీకులు కాలుష్యరహిత పర్యావరణంలో జీవించారు. కానీ మనం మాత్రం కలుషితమైన గాలిని పీలుస్తున్నాం. ఇలాంటి సమయంలో అగర్భత్తులు వెలిగించి మన చుట్టూ ఉన్న పొగను పెంచడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు వైద్యులు..

    పరిశోధకులు ఇదే విషయంపై పరిశోధనలు చేసి ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. అదేంటంటే అగరబత్తులు మనకు హానీ చేస్తాయని చెబుతున్నారు. ఇంతకీ వీటి వల్ల ఎలా హానీ జరగుతుంది. ఆరోగ్యాన్ని ఎలా ప్రభావం చేస్తాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

    అగర్బత్తులు ఎక్కువగా వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోస సంబంధ సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. దగ్గు, ఆస్తమా, ఎలర్జీలు, తలనొప్పి లాంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. రసాయనాలు ఉపయోగించి వీటిని తయారు చేస్తారట. ఫలితంగా కార్బన్ మోనాక్సైడ్ లాంటి ప్రమాదకర వాయువులు వెలువుడుతున్నాయని పేర్కొన్నారు. వాటిని పీల్చడం వల్ల అనారోగ్యపాలవుతారని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు.