Samarasimha Reddy: స్టార్ హీరోలు హీరోయిన్ లే కాదు కొందరు నటీనటులు కూడా వారి నటనతో స్టార్ స్టేటస్ ను సంపాదిస్తారు. విలన్ క్యారెక్టర్లకు కొందరు సూపర్ గా సూట్ అయితే.. కామెడీ క్యారెక్టర్లను కొందరు అదరగొడుతారు. మరికొందరు సాడ్ క్యారెక్టర్లను అదరగొడుతుంటారు. అయితే కొందరు హీరోల సినిమాల్లో కొన్ని కాంబినేషన్ లు రిపీట్ అవుతూనే ఉంటాయి. అలా బాలయ్య సినిమాలో జయప్రకాష్ రెడ్డి ఎక్కువ సార్లు విలన్ పాత్రను పోషించారు. ఇక బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం అంటారు కొందరు. అంతేకాదు ఆయన పెద్దలకు ఎక్కువ గౌరవం ఇస్తారని కూడా అంటారు.
ఇక జయప్రకాష్ రెడ్డి, బాలయ్య కాంబినేషన్ లలో ఎన్నో సినిమాలు రిపీట్ అయినా చాలా వరకు సక్సెస్ ను సాధించాయి. సమరసింహారెడ్డి సినిమాలో ఈయన పాత్ర నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఆయన నటన అద్భుతం అని ఎందరో కొనియాడారు. ఆ పాత్రకు ప్రాణం పోశారు. జీవించారు అనే కామెంట్లు వచ్చినా ఆయనకు అవార్డు రాకపోవడం బాధాకరం. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్యనే తెలిపారు. ఈ సినిమాలో జయప్రకాష్ రెడ్డి విలనిజం అద్భుతంగా ఉన్నా ఆయనకు అవార్డు రాకపోవడం తనను బాధ పెట్టింది అన్నారు బాలయ్య.
అంతేకాదు సమరసింహారెడ్డి సినిమాకు ఆయనకు అవార్డు రాకపోవడం అన్యాయం అన్నారు కూడా బాలయ్య. ఇక ఆయనంటే తనకు చాలా గౌరవం అని తెలిపారు. ఇక ఈ నటుడికి కూడా బాలయ్య అంటే చాలా గౌరవం ఉండేదట. ఇదిలా ఉంటే సమరసింహారెడ్డి సినిమా రీ రిలీజ్ కు సిద్దం అయింది. ఈ మూవీ మార్చి 2న రానుందట. దీనికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ వార్త విన్నా బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఇక బాలయ్య బాబి కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపరుడుతున్నారు. సితార బ్యానర్ లో తెరకెక్కే సినిమాలు విడుదలైన తర్వాతే ఈ సినిమా రానుందని టాక్. మరి ఈ సంవత్సరం బాలయ్య ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాలి.