Yatra 2: వైసీపీ నేతలకు యాత్ర 2 సినిమా కష్టాలు

తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో వైసీపీ నేతలు హడావిడి చేశారు. అయితే పాజిటివ్ టాక్ అందుకోవాలంటే దానిని కొనసాగించాలని చిత్ర యూనిట్ బృందం చెప్పుకొచ్చింది. దీంతో తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చాయి.

Written By: Dharma, Updated On : February 9, 2024 10:53 am

Yatra 2

Follow us on

Yatra 2: వైసీపీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. మొన్న ఆ మధ్యన నియోజకవర్గానికి 2000 చొప్పున సాక్షి కాపీలను బుక్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. పార్టీకి ప్రచారం కావడం, తామే అభ్యర్థులమని భావించడంతో చాలామంది ఆ 2000 కాపీలను బుక్ చేశారు. వాటినే దుకాణాలకు, హెయిర్ కటింగ్ సెలూన్ లకు ఉచితంగా వేస్తున్నారు. కానీ అసలు తనకు మీడియా అంటూ లేదని జగన్ చెబుతుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మతో ప్రచురిస్తున్న పత్రిక ఎవరిదంటే చటుక్కున జగన్ పేరు చెబుతారు. అయితే తాజాగా వైసీపీ నేతలకు యాత్ర 2 సినిమా చిక్కులు వచ్చాయి. ఆ సినిమా టికెట్లను వైసిపి నేతలే బుక్ చేసుకోవాలని.. ప్రజలకు ఉచితంగా చూపించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

జగన్ నిజ జీవిత ఆధారంగా యాత్ర2 సినిమాను రూపొందించారు. అంతకుముందు యాత్ర పేరిట విడుదలైన చిత్రం ప్రేక్షక ఆదరణ పొందింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం నటుడు మమ్ముట్టి ఒదిగిపోయారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో యాత్ర 2 పేరిట జగన్ పాత్రను చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. జగన్ పాత్రలో తమిళ నటుడు జీవ నటించారు. నిన్ననే ఆ చిత్రం విడుదలైంది. అయితే ఆ సినిమాను ఉచితంగా చూపించాలని పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థాయిలో వైసీపీ నేతలు ఎవరు ఆసక్తికరపరచడం లేదు. అటు టికెట్లు బుక్ చేసేందుకు కూడా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ముందుకు రావడం లేదు.

తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో వైసీపీ నేతలు హడావిడి చేశారు. అయితే పాజిటివ్ టాక్ అందుకోవాలంటే దానిని కొనసాగించాలని చిత్ర యూనిట్ బృందం చెప్పుకొచ్చింది. దీంతో తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చాయి. కానీ వైసీపీ టికెట్ ఖరారు అయిన వారు, ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు పెద్దగా సాహసించలేదు. టికెట్లు కొనుగోలు చేసి వైసీపీ శ్రేణులకు చూపించడానికి ఆసక్తి చూపలేదు. వైసిపి వీరాభిమానులు మాత్రం కొంచెం హడావిడి చేస్తున్నారు. నిన్నటికి నిన్న అసెంబ్లీ సమావేశాలు సైతం ఈ చిత్రం కారణంగానే వాయిదా పడ్డాయని విపక్షం ఆరోపిస్తోంది. బలవంతంగా వైసీపీ ఎమ్మెల్యేలను సినిమా చూపించేందుకు ప్రయత్నించారని.. అందుకే కోరం లేక సభ వాయిదా పడిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు ఆరోపించారు.

యాత్ర సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. యాత్ర 2 సినిమాకు సైతం పాజిటివ్ టాక్ వచ్చినట్లు వైసిపి నేతలు చెబుతున్నారు. కానీ థియేటర్లలో జనాలు కనిపించడం లేదు. యాత్ర 1 సినిమా చూపించడంలో వైసీపీ నేతలు ఉత్సాహం ప్రదర్శించారు. కానీ తాజాగా జగన్ చర్యలు కారణంగా వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో యాత్ర 2 సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. దీంతో ఈ సినిమాకు భారీ నష్టాలు రావడం ఖాయమని తేలింది. దీంతో చిత్ర యూనిట్ తలలు పట్టుకుంటోంది. త్వరలో వ్యూహం, శపథం సినిమాలు రానున్నాయి. అవి ఫక్తు రామ్ గోపాల్ వర్మ చిత్రాలు కావడంతో ప్రజల్లో ఒక రకమైన భావన ఉంటుంది. యాత్ర 2 సినిమాకి ఈ స్థాయి ఆదరణ ఉంటే.. మరి ఆర్జీవి చిత్రాలకు ఏ పరిస్థితి ఎదురవుతుందో అందరికీ తెలిసిందే.