Devotional:మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా పూజ కార్యక్రమాలు చేస్తున్న సమయంలో లేదా వ్రతాలు చేస్తున్న సమయంలో పూర్తిగా ఉల్లిపాయ వెల్లుల్లిని దూరం పెట్టాలని చెబుతారు.
అలాగే ఉపవాసం చేసేవారు కూడా ఇలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. అసలు పూజలు వ్రతాలు చేసేవారు ఇలాంటి ఆహార పదార్థాలు ఎందుకు దూరంగా ఉండాలి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
Also Read: మీ ఇంటికి సిరిసంపదలు కలగాలంటే ఈ మాలతో లక్ష్మీదేవిని పూజించాలి?
సాధారణంగా మనం తీసుకునే ఆహారం మూడు రకాలుగా ఉంటుంది. సాత్వికం, రాజసికం, తామసికం అని మూడు భాగాలుగా విభజించారు. ఇందులో వెల్లుల్లి, ఉల్లిపాయ రాజసికం గుణానికి సంబంధించినవి. ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన మనసులో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఎలాంటి ఆలోచనలు రాకపోవడం ఏకాగ్రత లేకపోవడం విపరీతమైన కోపం వస్తాయి. అందుకోసమే పూజ చేసే సమయంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు అని చెబుతారు.
పూజ ఎల్లప్పుడు మనస్ఫూర్తిగా భక్తిశ్రద్ధలతో దేవునిపై ఏకాగ్రత పెట్టి చేయాల్సి ఉంటుంది ఆ సమయంలోనే ఇలాంటి పదార్థాలను తినడం వల్ల స్వామి వారి పై ఏకాగ్రత తప్పుతుంది. అదేవిధంగా కోపం కూడా వస్తుంది కనుక ఇలాంటి ఆహార పదార్థాలను తినకుండా పూజా కార్యక్రమాలలో పాల్గొనాలని పండితులు చెబుతుంటారు.
Also Read: కొత్త సంవత్సరంలో విజయాలు పొందాలంటే.. ఇవి పాటించాల్సిందే.. ఆచార్య చాణక్య!
ఇవి కూడా చదవండి
1. సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే కథలే నేను తీస్తా- పా.రంజిత్
2. ‘అఖండ’ విజయం కూడా ఆమెకు కలిసి రాలేదు !
3. కాపుల రాజ్యాధికారం సరే.. నడిపించే నాయకుడు ఎవరు?
4. ఎంతమంది బ్యూటీలున్నా.. ఈ మిల్కీ బ్యూటీ చాలా స్పెషల్