Karan Johar: బాహుబలి సినిమా తర్వాత లెక్కలు అన్ని మరి పోయాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు సౌత్ లో వారు బాలీవుడ్ ఇండస్ట్రీ లో తమ సినిమాలను రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా కరణ్ జోహార్ సహాయం అడిగేవారు. అడిగేవారు కాదు ఆయన సహాయం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు లెక్కలన్నీ మరి పోయాయి. బాహుబలి సినిమాతో ఈ లెక్కలన్నీ జక్కన్న తిరగ రాసాడు.

ఇప్పుడు కరణ్ జోహార్ అంతటి స్టార్ నే రాజమౌళి రాజముద్రను తన సినిమాలపై వేయించు కుంటున్నాడు. బ్రహ్మాస్త్ర సినిమా కోసం కరణ్ జోహార్ రాజమౌళి సహాయం తీసుకున్నాడు. సౌత్ లో కూడా ఈ సినిమాపై భారీ స్పందన రావాలంటే రాజమౌళి ఇమేజ్ ను వాడుకోక తప్పలేదు. కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర సినిమాకు సౌత్ లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
బాహుబలి సినిమాను రాజమౌళి ఎంత బాగా చెక్కినా కూడా బాలీవుడ్ లో అంతటి విజయాన్ని సొంతం చేసుకుంది అంటే మాత్రం ఖచ్చితంగా కరణ్ జోహార్ అనే ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు రాజమౌళి విడుదల చేయబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల విషయంలో కూడా కరణ్ జోహార్ హ్యాండ్ ఉంది. ఇక వీరి మధ్య స్నేహం కారణంగా బ్రహ్మాస్త్ర సినిమాకు రాజమౌళి తన బుజాల మీద వేసుకున్నారని తెలుస్తుంది.
Also Read: జక్కన్నకు, మోహన్ బాబుకు మధ్య మనస్పర్థలకు కారణం ఆ విషయమేనా?
అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి మీద భారతీయ ప్రేక్షకులకు భారీ విశ్వాసం ఉంది. ఆయన తీసే సినిమాలు బలమైన కథ కథనాలు ఉంటాయని కళ్ళు చెదిరే యాక్షన్ సీన్స్, తూటాల్లాంటి మాటలతో పాటు, భారీ విజువల్స్ ఉంటాయని అందరికి అర్ధం అయ్యింది. అందుకే ఆయన సినిమాలకు అంత వాల్యూ ఉంది. ఆయన ఒక్క మాట చెప్తే చాలు ఎలాంటి సినిమా అయినా కలెక్షన్స్ రాబడుతాయి.
ఆయన మాట తోనే మంచి సినిమా అని ప్రేక్షకులు భావిస్తారు. అందుకే కరణ్ జోహార్ లాంటి స్టార్ కూడా రాజమౌళి ముద్రను వేయించు కున్నాడు. ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తే ఆ సినిమాలో చాలా విషయం ఉందని అర్ధం అవుతుంది. అదే సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది. బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా రాజమౌళి వల్ల భారీ కలెక్షన్స్ రావడం ఖాయం గా కనిపిస్తుంది. మొత్తానికి రాజమౌళి, కరణ్ జోహార్ స్నేహం మరింత గట్టిపడుతుందనే చెప్పాలి.
Also Read: ముంబయి ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెర్రీ, తారక్ స్పెషల్ పర్ఫార్మెన్స్