https://oktelugu.com/

Jabardast: జబర్దస్త్‌కు ఇద్దరు టీంలీడర్లు గుడ్ బై.. కారణమెంటీ?

Jabardast: జబర్దస్త్ కామెడీ షోకు బుల్లితెరపై ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.  2013లో ప్రారంభమైన ఈ షో బుల్లితెర మీద ఎంతపెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈటీవీలో ప్రసారమయ్యే ఏడుపుగొట్టు సీరియళ్లకు భిన్నంగా వచ్చిన ‘జబర్దస్త్’ కామెడీ షో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. జబర్దస్త్ షో మల్లెమాల సంస్థకు కాసుల వర్షం కురిపించడంతో అదే కాన్సెప్ట్ తో మరో ప్రొగ్రాం వచ్చింది. కామెడీ డోసును మరింత పెంచుతూ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 19, 2021 / 01:20 PM IST
    Follow us on

    Jabardast: జబర్దస్త్ కామెడీ షోకు బుల్లితెరపై ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.  2013లో ప్రారంభమైన ఈ షో బుల్లితెర మీద ఎంతపెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈటీవీలో ప్రసారమయ్యే ఏడుపుగొట్టు సీరియళ్లకు భిన్నంగా వచ్చిన ‘జబర్దస్త్’ కామెడీ షో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేసింది.

    జబర్దస్త్ షో మల్లెమాల సంస్థకు కాసుల వర్షం కురిపించడంతో అదే కాన్సెప్ట్ తో మరో ప్రొగ్రాం వచ్చింది. కామెడీ డోసును మరింత పెంచుతూ ‘ఎక్సట్రా జబర్దస్త్’ కార్యక్రమాన్ని ఆ సంస్థ తీసుకొచ్చింది. గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యే ఈ షోకు గత కొన్నేళ్లుగా అత్యధిక టీఆర్పీ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఆ షోలో చేసిన వారంతా ఒక్కక్కరుగా దూరమవుతున్నారు.

    జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్ షోలకు అనసూయ, రష్మీలు గ్లామర్ తీసుకురాగా జడ్జీలుగా నాగబాబు, రోజాలు షోను ఒక లెవల్ కు తీసుకెళ్లారు. అయితే కొన్ని విబేధాలతో మెగాబ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ప్రస్తుతం సింగర్ మను జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ షో క్రమంగా తన క్రేజ్ ను కోల్పోతూ వస్తోంది.

    ఇతర ఛానల్లో ఈ షోకు పోటీగా కామెడీ షోలు వస్తున్నాయి. మరోవైపు జబర్దస్త్ లో టాప్ కామెడీయన్లుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు టీం లీడర్లు ఈ షోను తప్పుకున్నారు. సినిమా ఆఫర్లు, తదితర కారణాలతో వారంతా ఈ షోకు దూరవుతున్నారని తెలుస్తోంది. అలాగే కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే కామెడీయన్లు జబర్దస్త్ ఒక వేదికగా మారింది.

    ఇటీవల కాలంలో జబర్దస్త్ ను వీడుతున్న కామెడీయన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఇద్దరు టీం లీడర్లు ఏకంగా జబర్దస్త్ ను వీడటం చర్చనీయాంశంగా మారింది. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అదిరే అభి, జిగేల్ జీవన్ తాజాగా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ‘కామెడీ స్టార్స్’లో ఓ స్కిట్ ను అదిరే అభి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

    ‘కామెడీ స్టార్స్’ మాటీవీలో ప్రసారం అవుతోంది. ఈ షోకు మెగా బ్రదర్ నాగబాబు, హీరోయిన్ శ్రీదేవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరిద్దరు జబర్దస్త్ వీడటం వెనుక నాగబాబు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరు కామెడీ స్టార్స్ లో చేసిన జబర్దస్త్ ను వీడినట్లు ఎక్కడ ప్రకటించ లేదు. అయితే సినీవర్గాలు మాత్రం వారిద్దరు జబర్దస్త్‌ను వదిలేసినట్లుగా అర్ధం చేసుకోవాలని చెబుతున్నాయి.

    త్వరలోనే సుధీర్ తోపాటు మరికొందరు టాప్ కామెడీయన్లు జబర్దస్త్ ను వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సుధీర్ ను ఢీ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అందుకే అతడు డిసెంబర్ 31 స్పెషల్ ఈవెంట్లోనూ కనిపించలేదు. ఏదిఏమైనా జబర్దస్త్ నుంచి వరుసగా కామెడీయన్లు ఇతర ఛానళ్లకు క్యూ కడుతుండటంతో ఒకింత ఆసక్తిని రేపుతోంది.