Mosquito Bite Reason: మనకు రాత్రయిందంటే చాలు దోమల మోతతో ఇళ్లన్ని దద్దరిల్లుతాయి. కరెంటుపోయిందంటే దోమలు విజృంభిస్తాయి. ఎక్కడ పడితే అక్కడ కుడుతూ వేధిస్తుంటాయి. దీంతో మనకు నిద్రకు భంగమే కలుగుతుంది. దోమలు లేని దేశం ఫ్రాన్స్ అని తెలిసిందే. అక్కడ ఒక్క దోమ కూడా కనిపించదు. కానీ మన దేశంలో సాయంత్రం అయిందంటే చాలు దోమలు రెచ్చిపోయి మనతో ఆటాడుకుంటాయి. దోమలు మనుషులను ఎందుకు కుడతాయి. వాటికి ఏ వాసన వస్తుంది? అవి ఎందుకు మనల్ని టార్గెట్ చేసుకుని మన రక్తాన్ని తాగుతాయి లాంటి ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి.

దోమల తీరుపై అమెరికాలోని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చర్మంపై కార్బాక్సిలిడ్ యాసిడ్ లు ఉన్న వారు డెంగ్యూ, మలేరియా, ఎల్లో ఫీవర్ వంటి రోగాల బారిన పడతారని తేలింది. ఈ వ్యాధులను వ్యాప్తి చేయడానికి ఆడ ఏడెస్ ఈజిప్టు దోమలు వాహకాలుగా మారుతాయి. వారినే ఎక్కువగా కుట్టేందుకు దోమలు ప్రయత్నిస్తుంటాయి. ఆహారంలో మార్పులు, వస్త్రధారణ అలవాట్లతో సంబంధం లేకుండా దోమల పట్ల మానవుల ఆకర్షణ కొనసాగుతుంది. దీంతో అవి మానవుల దేహాలను కాటు వేసి రక్తాన్ని పీల్చి రోగాలు వ్యాపించేందుకు కారణమవుతున్నాయి.
కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చే వాసనలతో కూడా దోమలు ఆకర్షిస్తాయి. దోమలలో ఉండే అయస్కాంతాలు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి. దీంతో అవి మానవులను త్వరగా గుర్తించి వారి రక్తాన్ని పీల్చేందుకు ప్రయత్నిస్తుంది. మనం ధరించే దుస్తులు కూడా వాటికి అనుకూలంగా ఉన్నట్లయితే అవి రెచ్చిపోతాయి. ముదురు రంగు దుస్తులు ధరిస్తే దోమలు త్వరగా ఆకర్షిస్తాయి. లైట్ కలర్ దుస్తులు ధరిస్తే దోమలు ఆకర్షించవు. దీంతో వాటి బారి నుంచి రక్షించుకోవాలంటే లైట్ కలర్ బట్టలు ధరించడం శ్రేయస్కరం.
దోమల ఆకర్షణ శక్తిపై అమెరికాలో విస్తృత పరిశోధనలు కొనసాగించారు. వాటి కదలికలపై ఎన్ని రకాలుగా శోధన చేశారు. యూనివర్సిటీకి చెందిన అరవై నాలుగు మంది వాలంటీర్లపై పరిశోధన చేసి కొన్ని విషయాలు తేల్చారు. దోమలు తమకు ఇష్టమైన వ్యక్తులనే ఎంచుకొని కుడుతాయని తేలింది.

దోమలకు ఇష్టమైన వారి చర్మంలో అధిక స్థాయిలో యాసిడ్ స్థాయిలు ఉన్నాయని కనుగొన్నారు. చర్మంపై జిడ్డుతో కూడిన అణువులు ఉండటంతో దోమలు ఆకర్షణకు గురవుతాయి. దోమలకు ఉండే అయస్కాంత లక్షణంతో మనల్ని టార్గెట్ చేసుకుని రక్తం తాగుతాయి. దీనికారణంగానే మనం పలు విష జ్వరాల బారిన పడుతుంటాం. డెంగీ సోకితే మరణమే. ఈక్రమంలో దోమలను దూరం చేసుకునేందుకే మనం పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దోమల నివారణకు పలు దోమల నివారణ మందులు, జెట్ లు వాడుతాం. మొత్తంగా దోమలు కూడా తెలివిగా కొన్ని లక్షణాలు ఉన్నవారినే ఎక్కువగా కుడుతాయని తేలింది.