Prince Collections: డాక్టర్ , డాన్ వంటి వరుస భారీ బ్లాక్ బస్టర్స్ తో తిరుగులేని స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న శివ కార్తికేయన్ జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో కలిసి ‘ప్రిన్స్’ అనే సినిమా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..తెలుగు లో కూడా డాక్టర్, డాన్ వంటి చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడం..దానికి తోడు జాతి రత్నాలు వంటి బ్లాక్ బస్టర్ ని తీసిన అనుదీప్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా కావడం తో ఈ చిత్రానికి విడుదలకి ముందు కూడా మంచి అంచనాలే ఉండేవి.

అలాంటి అంచనాలతో విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది..కానీ రోజు మొత్తం గడిచేసరికి డివైడ్ టాక్ తో స్థిరపడింది..కానీ ఓపెనింగ్స్ మాత్రం పర్వాలేదు అనిపించింది కానీ అది కాంబినేషన్ కి తగ్గ వసూళ్లు కావనే చెప్పాలి..ఇక కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లు ఈ సినిమాకి ఎంత వచ్చాయి అనేది ఇప్పుడు ఒక లుక్ వేద్దాం.
ఈ సినిమా తెలుగు హక్కులు మూడు కోట్ల 80 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది..మొదటి రోజు నైజాం ప్రాంతం లో 35 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యగా..ఆంధ్ర + సీడెడ్ కలిపి 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా మొదటి రోజు 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..దీపావళి వీకెండ్ అవ్వడం తో తెలుగు లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ తమిళం లో మాత్రం ఫ్లాప్ గా నిలిచేట్టు ఉంది..అక్కడ ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది..అనుదీప్ కామెడీ ఎంటెర్టైనెర్స్ అలాగే ఉంటాయి.

హిట్ అయితే జాతి రత్నాలు రేంజ్ లో హిట్ అవుతాయి..కానీ ఆ కామెడీ ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ కాకపోతే మాత్రం ప్రిన్స్ కి వచ్చిన రెస్పాన్స్ వస్తుందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం..వరుస విజయాలతో తమిళ నాడు లో రజిని , అజిత్ మరియు విజయ్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో నేనే అనేంత రేంజ్ దూసుకుపోతున్న శివ కార్తికేయన్ కి స్పీడ్ బ్రేకర్ పడినట్టు అయ్యింది.