https://oktelugu.com/

Aunty- Daughter-in-law : అత్తా కోడళ్లు ఎందుకు గొడవ పడతారు? దీనికి పరిష్కారం ఏమిటి?

ఇంటికి వచ్చిన కోడలిని అత్త తన కూతురిలా భావించి చూసుకోవాలి. కోడలు కూడా తన అత్తను తల్లిలా భావించాలి. అప్పుడే సగం సమస్య తగ్గుతుంది. కానీ చాలామంది ఇలా చేయరు. కొడుకు తన కంటే భార్యకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని కొందరు ఫీల్ అవుతారు. దీంతో ఈర్ష వచ్చి కోడలితో అత్త గొడవ పెట్టుకుంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 28, 2024 5:52 pm
    Aunty- Daughter-in-law

    Aunty- Daughter-in-law

    Follow us on

    Aunty- Daughter-in-law :  సాధారణంగా ఏ ఇంట్లో చూసిన అత్తా కోడళ్లు అన్యోన్యంగా ఉండరు. ఏ వెయ్యి మందిలో ఎవరో అత్తా కోడళ్లు మాత్రమే సక్రమంగా ఉంటారు. ఇద్దరూ ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక చిన్న విషయంలో వాళ్లకు గొడవలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఇంట్లో ఉండే వాళ్లు నలిగిపోతారు. సాధారణంగా అమ్మకి, కూతురికి మధ్య గొడవలు వస్తుంటాయి. కానీ మళ్లీ కలిసిపోతారు. కానీ తల్లి కూతుళ్లు లాగా అత్తా కోడళ్లు ఎందుకు ఉండలేరు. అత్త బాగా చూసుకున్న ఎప్పటికీ అమ్మ కాలేదు కదా. అత్తా కోడళ్లు చాలా చిన్న విషయాలకి కూడా గొడవలు పడుతుంటారు. కారణం లేకుండా ప్రతి దానికి గొడవ పెట్టుకుంటారు. భార్యకి లేదా తల్లికి.. ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక ఇద్దరి మధ్య ఇబ్బంది పడతారు. అసలు ఇద్దరు గొడవ పడటానికి కారణమేంటి? దీనికి మరి పరిష్కారం ఏంటో తెలుసుకుందాం.

    ఇంటికి వచ్చిన కోడలిని అత్త తన కూతురిలా భావించి చూసుకోవాలి. కోడలు కూడా తన అత్తను తల్లిలా భావించాలి. అప్పుడే సగం సమస్య తగ్గుతుంది. కానీ చాలామంది ఇలా చేయరు. కొడుకు తన కంటే భార్యకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని కొందరు ఫీల్ అవుతారు. దీంతో ఈర్ష వచ్చి కోడలితో అత్త గొడవ పెట్టుకుంటుంది. అలాగే కోడలు పెత్తనం చేస్తుంది ఏమో అని భయంతో కూడా వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఎందుకంటే ఇద్దరూ అమ్మాయిలే. తన మీద ఎవరు పెత్తనం చేసిన నచ్చదు. ఈ కారణంతోనే ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. కొందరు భర్తలు తల్లి మాట మాత్రమే వింటారు. అసలు భార్యను పట్టించుకోరు. దీనివల్ల కూడా అత్తా కోడళ్ల మధ్య సమస్యలు వస్తాయి. కుటుంబం అన్నాక అందరూ కలిసి సంతోషంగా ఉండాలి. అంతే కానీ మన ఇంట్లోకి వచ్చిన అమ్మాయిని పట్టించుకోకుండా ఉండకూడదు.

    కొందరు అత్తలు కోడళ్లు చేసి వంట బాగాలేదని అంటారు. తన కూతురు బాగా వండుతుందని చెబుతుంటారు. ఇలా కోడలిని తక్కువ చేసి కూతురిని పొగిడితే కోడలకి నచ్చదు. దీనివల్ల ఏదో ఒక చిన్న గొడవ అవుతుంది. కూతుర్ని, కోడల్ని సమానంగా చూడాలి. అలాగే ఇంట్లో జరిగిన విషయాలు బయట చెప్పకూడదు. కొందరు అత్తలు లేదా కోడళ్లు ఇంట్లో జరిగిన గొడవలు లేదా ఏ విషయాన్ని అయిన అందరితో చెబుతారు. వీటివల్ల ఇతరులు మీ అత్తా కోడళ్ల మధ్య ఇంకా గొడవలు పెంచడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇంటి గట్టును ఎప్పుడూ కూడా రట్టు చేయకండి. ఎన్ని సమస్యలు వచ్చిన అత్తా కోడళ్లు అన్యోన్యంగా ఉండాలి. బయట వాళ్ల మాటలను పట్టించుకోకూడదు. ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. గొడవ పడినా వెంటనే మళ్లీ కలిసిపోవాలనే ఆలోచన రావాలి. అప్పుడే అత్తా కోడళ్లు.. తల్లి కూతుళ్లుగా సంతోషంగా ఉంటారు.