https://oktelugu.com/

Bank Calls: ఇకపై బ్యాంకు నుంచి ఈ నంబర్ సిరీస్‌తోనే కాల్స్.. స్కామ్‌లు తగ్గినట్లే!

సైబర్ మోసాలను ఆరికట్టాలని ట్రాయ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బ్యాంకుల నుంచి వచ్చే కాల్స్ 160 సిరీస్‌తో వచ్చేటట్లు మార్పులు చేసింది. అంటే మీకు ఇకపై 160XXXXXXX ఈ సిరీస్ నంబర్‌తో కాల్స్ వస్తాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 29, 2024 / 06:03 AM IST

    Bank Calls

    Follow us on

    Bank Calls: ప్రస్తుతం సైబర్ స్కామ‌లులు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి ద్వారా చాలామంది వాళ్ల డబ్బును పొగొట్టుకుంటున్నారు. అయితే ఈమధ్య కాలంలో రోజుకి ఎన్నో కేసులు ఇలాంటివి జరుగుతున్నాయి. సాధారణంగా మన మొబైల్‌కి రోజూ ఏదో ఒక స్పామ్ కాల్ వస్తుంది. ఈ బ్యాంకు నుంచి కాల్ చేశాం. మీకు క్రెడిట్ కార్డు లేదా లోన్ కావాలా.. అని అడుగుతుంటారు. కొంతమంది వీటిని రిజక్ట్ చేస్తే మరికొందరు డిటైల్స్ తెలుసుకుందామని అన్ని అడుగుతారు. అలా వాళ్లు అడిగిన డిటైల్స్ చెబుతారు. కాల్ మాట్లాడుతుండగా లేక కాల్ కట్ అయిన వెంటనే అకౌంట్లో ఉన్న డబ్బులు కట్ అయిపోతాయి. ఈమధ్య కాలంలో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. దీనివల్ల చాలామంది వాళ్ల డబ్బులు పొగొట్టుకుంటున్నారు. ఇలాంటి సమస్యలను ఆరికట్టడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త సిరీస్ ఫోన్ నంబర్లను ప్రవేశపెట్టింది. ఇంతకీ ఆ నంబర్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

    సైబర్ మోసాలను ఆరికట్టాలని ట్రాయ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బ్యాంకుల నుంచి వచ్చే కాల్స్ 160 సిరీస్‌తో వచ్చేటట్లు మార్పులు చేసింది. అంటే మీకు ఇకపై 160XXXXXXX ఈ సిరీస్ నంబర్‌తో కాల్స్ వస్తాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు కూడా ఇకపై 160 సిరీస్ ఫోన్‌‌ నంబర్‌కు మారుతున్నాయి. అంటే బ్యాంకులు, ఇన్సురెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ కంపెనీలు అన్ని ట్రాన్సాక్షన్ కాల్స్ 160 సిరీస్‌తో మొదలవుతాయి. ఈ సిరీస్ నంబర్ నుంచి కాకుండా వేరే సిరీస్‌తో ఇలా వస్తే అవి మోసపూరిత కాల్ అని గుర్తించండి.

    సర్వీస్‌లు, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం 160 సిరీస్ ఉపయోగించగా.. మార్కెటింగ్ కోస 140 సిరీస్‌ను అమలు చేశారు. దీనివల్ల స్పామ్ కాల్స్‌ను నియంత్రించవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యకిగత మొబైల్ నంబర్ నుంచి టెలి మార్కెటింగ్ చేస్తే ఆ నంబర్‌ను రెండేళ్ల పాటు బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతారు. ఆ సిరీస్ నుంచి కాల్స్ రాకుండా 10 అంకెల మొబైల్ నంబర్ నుంచి ఏదైనా కాల్, మెసేజ్ వస్తే మీరు ఆ నంబర్‌పై ఫిర్యాదు చేయవచ్చు. మీరు నేరుగా 1909కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఈ రూల్స్ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనివల్ల స్కామ్‌లను ఈజీగా గుర్తించవచ్చు అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి బ్యాంకు కాల్స్ అయిన 160 సిరీస్‌తోనే స్టార్ట్ అవుతాయి. ఆ సిరీస్ కాకుండా వేరే సిరీస్ వస్తే మీకు సందేహ పడాల్సిందే.