keethi sri
Overnight Star: కరోనా వైరస్ తో ప్రపంచం అస్తవ్యస్తంగా మారింది. ఈ వైరస్ ప్రపంచం నలుమూలన వ్యాపించడంతో కొందరి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వ్యాపారులు, ఉద్యోగులు ఆర్థికంగా చితిగిపోయారు. పెద్దపెద్ద వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. దీంతో ఈ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను తీసివేయాల్సి వచ్చింది. అయితే కరోనా వల్ల కొంతమందికి తీవ్ర నష్టం కలిగితే.. మరి కొంతమంది మాత్రం ఆర్థికంగా లాభపడ్డారు. ఇంకొందరు కరోనా సమయములోనే పాపులర్ అయ్యారు. కరోనా సమయంలో ఇంట్లోనే కొందరు రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అవి వైరల్ గా మారడంతో చాలామంది వీరికి ఫ్యాన్స్ పెరిగిపోయారు.. ఇలా ఓ క్యూట్ గర్ల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించడంతో ఆమెకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందంటే?
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు Reels చేయడంలో ఉత్సాహం చూపుతున్నారు. కొందరు సొంతంగా క్రియేట్ చేసి వీడియోలు తయారు చేస్తుండగా.. మరికొందరు సినిమాలోని కొన్ని సీన్లను అనుసరించి ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకొందరు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇలా రీల్స్ చేసి ఆ తర్వాత సినిమాల్లో నటించి స్టార్లు అయిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే కరోనా సమయంలో ఓ బేబీ తెలుగు సినిమాలోని సీన్లను meems గా చేసి ఆకట్టుకుంది.
ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ ఆకట్టుకుంటుంది. ఈ కామెడీని అనుసరించి చేసిన ఆ అమ్మాయి వీడియో తెగ పాపులారిటీ సాధించింది. దీంతో ఆమె రాత్రికి రాత్రి స్టార్ అయింది.. ఆ తర్వాత నాని హీరోగా నటించిన దసరా మూవీలోని చంకీలా అంగీలేసే అనే సాంగ్కు డాన్స్ చేసింది. దీంతో మరింత క్రేజ్ సంపాదించుకొని ఫాలోవర్స్ పెంచుకుంది. అయితే కరోనా సమయంలో ఆమె చేసిన కామెడీ వీడియో జనాలను బాగా ఆకట్టుకుంది. అప్పటినుంచి పలు వీడియోలు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇంతకు ఈమె ఎవరో అని చాలామంది ఆరా తీశారు.
ఈ అమ్మాయి పేరు కీర్తి శ్రీ. ఈమె నిత్యం ఏదో రకమైన వీడియో చేస్తూ వీటిని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఈమె చేసే రీల్స్ కు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఓ వీడియో వైరల్ గా మారింది. ఇందులో ఆమె వీడియో చేస్తుండగా తల్లిదండ్రులు సంతోషంగా కనిపించారు. ఎంతో క్యూట్ గా ఉన్న ఈ గర్ల్ ను చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యారు. ఆ సమయంలో ఫ్యూచర్లో స్టార్ గా మారుతుందని కామెంట్ చేస్తున్నారు.
అనుకున్నట్లుగానే ఆమె కీర్తి శ్రీ ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఈమెకు సినిమాల్లో అవకాశాల్లో వస్తాయని చాలామంది అంటున్నారు. అయితే భవిష్యత్తులో ఆమె మరి ఎలాంటి వీడియోతో ఆకర్షిస్తుందో చూడాలి..